వరంగల్ పార్లమెంటు సభ్యుడా…. నేను ఉపరాష్ట్రపతిని మాట్లాడుతున్నా..

దిశ, వరంగల్: ‘ఎంపీ పసునూరి దయాకర్ గారు.. బాగున్నారా…? మీ వద్ద ఏ విధంగా కరోనా కట్టడి ఉంది. అందుకోసం మీరు, జిల్లా యంత్రాంగం తీసుకుంటున్న చర్యలేంటి’ అని దేశ ద్వితియ పౌరుడు.. ఒక పార్లమెంటు మెంబర్ ను అడిగి ఆ వివరాలేమిటో తెలుసుకున్నారు. వరంగల్ ఎంపీ పసునూరి దయాకర్ కు సోమవారం ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు ఫోన్ చేశారు. ఉమ్మడి వరంగల్ జిల్లాలో కరోనా పరిస్థితిపై ఆరా తీశారు. కరోనాను కట్టిడి చేస్తున్నారా.. లేదా […]

Update: 2020-05-11 07:18 GMT

దిశ, వరంగల్: ‘ఎంపీ పసునూరి దయాకర్ గారు.. బాగున్నారా…? మీ వద్ద ఏ విధంగా కరోనా కట్టడి ఉంది. అందుకోసం మీరు, జిల్లా యంత్రాంగం తీసుకుంటున్న చర్యలేంటి’ అని దేశ ద్వితియ పౌరుడు.. ఒక పార్లమెంటు మెంబర్ ను అడిగి ఆ వివరాలేమిటో తెలుసుకున్నారు.

వరంగల్ ఎంపీ పసునూరి దయాకర్ కు సోమవారం ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు ఫోన్ చేశారు. ఉమ్మడి వరంగల్ జిల్లాలో కరోనా పరిస్థితిపై ఆరా తీశారు. కరోనాను కట్టిడి చేస్తున్నారా.. లేదా అని ఎంపీని అడిగి తెలుసుకున్నారు. కరోనా వైరస్ పట్ల మరింత అప్రమత్తంగా ఉండాల్సిన అవసరముందని ఎంపీకి సూచించారు.

ఇదిలా ఉంటే కరోనాను నియంత్రించేందుకు కేంద్ర ప్రభుత్వం లాక్ డౌన్ విధించింది. అందులో భాగంగా ప్రతి ఒక్కరూ ఇంటికే పరిమితం కావాలని సూచించింది. ఉప రాష్ట్రపతి కూడా ఈ నిబంధనలను పాటిస్తున్నారు. ఈ సమయంలో పార్లమెంటు సభ్యులకు ఫోన్ చేసి కరోనా పరిస్థితి వివరాలేంటని ఆరా తీస్తున్నారు. అదేవిధంగా పలు సూచనలు చేస్తున్న విషయం తెలిసిందే.

Photo: Venkaiah naidu, MP Pasunoori Dhayakar

Tags:    

Similar News