మీకు మేమున్నాం.. నిర్భయంగా ఓటేయండి : సీపీ తరుణ్ జోషి
దిశ, కమలాపూర్ : ప్రజలందరూ నిర్భయంగా తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని వరంగల్ పోలీస్ కమిషనర్ తరుణ్ జోషి అన్నారు. హనుమకొండ జిల్లా కమలాపూర్ మండల కేంద్రంలోని పోలీస్‌స్టేషన్లో ఆయన విలేకరుల సమావేశం నిర్వహంచారు. ఈ సందర్భంగా సీపీ మాట్లాడుతూ.. మండలంలోని 23 గ్రామాలను ప్రత్యేక జోన్లుగా ఏర్పాటు చేశామన్నారు. ఎప్పటికప్పుడు రాత్రి, పగలు షిఫ్ట్‌ల వారీగా పెట్రోలింగ్ నిర్వహిస్తారని, సమస్యాత్మక ప్రాంతాలలో ప్రత్యేక సిబ్బందిని ఏర్పాటు చేశామన్నారు. మండలంలో 65 పోలింగ్ కేంద్రాలు ఉన్నాయని.. పోలీస్ […]
దిశ, కమలాపూర్ : ప్రజలందరూ నిర్భయంగా తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని వరంగల్ పోలీస్ కమిషనర్ తరుణ్ జోషి అన్నారు. హనుమకొండ జిల్లా కమలాపూర్ మండల కేంద్రంలోని పోలీస్‌స్టేషన్లో ఆయన విలేకరుల సమావేశం నిర్వహంచారు. ఈ సందర్భంగా సీపీ మాట్లాడుతూ.. మండలంలోని 23 గ్రామాలను ప్రత్యేక జోన్లుగా ఏర్పాటు చేశామన్నారు. ఎప్పటికప్పుడు రాత్రి, పగలు షిఫ్ట్‌ల వారీగా పెట్రోలింగ్ నిర్వహిస్తారని, సమస్యాత్మక ప్రాంతాలలో ప్రత్యేక సిబ్బందిని ఏర్పాటు చేశామన్నారు.
మండలంలో 65 పోలింగ్ కేంద్రాలు ఉన్నాయని.. పోలీస్ శాఖ, రెవెన్యూ సిబ్బంది మరియు ఎన్నికల సిబ్బంది అందరూ కో-ఆర్డినేషన్‌తో పనిచేస్తున్నట్టు తెలిపారు. కరీంనగర్ జిల్లా అధికారుల నుంచి కూడా మంచి సహకారం అందుతుందని తెలిపారు. మండలంలో ఉప్పల్, అంబాల, శంభునిపల్లి గ్రామాలలో చెక్ పోస్టులు ఏర్పాటు చేశామన్నారు. ఎన్నికల నిబంధనలకు వ్యతిరేకంగా ఎవరూ నడుచుకోకూడదని సూచించారు. మండలంలో మొత్తం 65 పోలింగ్ కేంద్రాలు ఉన్నాయని, ఎన్నికల కోడ్ ఉన్నందువల్ల ప్రతిఒక్కరూ అధికారులకు సహకరించాలని కోరారు. ప్రశాంతమైన వాతావరణంలో ప్రజలు తమ ఓటు వినియోగించు కోవాలని విజ్ఞప్తి చేశారు.