టీఆర్‌ఎస్ VS బీజేపీ.. తారాస్థాయికి చేరుకున్న మాటల యుద్ధం
దిశ ప్రతినిధి, మేడ్చల్: అసలే ఎండలు మండిపోతున్నాయి. దీనికితోడు ఎమ్మెల్సీ ఎన్నికల రాజకీయ వేడి రాజుకుంటోంది. మరోపక్క సోషల్ మీడియా వేదికగా చేస్తున్న పోస్టులు పొలిటికల్ హీట్‌ను మరింత పెంచుతున్నాయి. నేతల మధ్య మాటల యుద్ధం కాక పుట్టిస్తోంటే.. ప్రజల్లో అవే చర్చనీయాంశామవుతున్నాయి. గోడకు వేలాడే తుపాకి పోలింగ్ గడువు సమీపిస్తుండడంతో ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారం జోరందుకుంది. ఓ వైపు బీజేపీ.. మరోవైపు టీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ ఎన్నికల వేళ మాటల తూటాలను పేల్చుకుంటున్నాయి. నేతల విమర్శలు, ఎదురు […]
దిశ ప్రతినిధి, మేడ్చల్: అసలే ఎండలు మండిపోతున్నాయి. దీనికితోడు ఎమ్మెల్సీ ఎన్నికల రాజకీయ వేడి రాజుకుంటోంది. మరోపక్క సోషల్ మీడియా వేదికగా చేస్తున్న పోస్టులు పొలిటికల్ హీట్‌ను మరింత పెంచుతున్నాయి. నేతల మధ్య మాటల యుద్ధం కాక పుట్టిస్తోంటే.. ప్రజల్లో అవే చర్చనీయాంశామవుతున్నాయి.
గోడకు వేలాడే తుపాకి
పోలింగ్ గడువు సమీపిస్తుండడంతో ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారం జోరందుకుంది. ఓ వైపు బీజేపీ.. మరోవైపు టీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ ఎన్నికల వేళ మాటల తూటాలను పేల్చుకుంటున్నాయి. నేతల విమర్శలు, ఎదురు దాడులతో తెలంగాణ పాలిటిక్స్ మరింత హీటెక్కాయి. మా మౌనం గోడకు వేలాడే తుపాకీలాంటిదంటూ బీజేపీకి మంత్రి కేటీఆర్ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. గోడకు వేలాడిన తుపాకి కూడా సైలెంట్‌గానే ఉంటుందని, వాడటం మొదలు పెడితే చీల్చిచెండాడుతుందంటూ కేటీఆర్ ఇచ్చిన హెచ్చరికకు తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. మీ తుపాకి ఫామ్ హౌజ్ లో తుప్పు పట్టి పోయిందని, ఇప్పుడు పేలే పిరిస్థితి లేదని కౌంటరిచ్చారు.
గెలువలేని చోట పీవీ కుమార్తె
రంగారెడ్డి- హైదరాబాద్- మహబూబ్ నగర్ గెలవలేని చోట పీవీ కుమార్తెకు ఎమ్మెల్సీ సీటు ఇచ్చారంటూ బండి సంజయ్‌తోపాటు బీజేపీ, కాంగ్రెస్ పార్టీ నేతలు విమర్శిస్తున్నారు. పీవీపైన అంతగా గౌరవం ఉంటే ఏ రాజ్యసభకో లేదా గవర్నర్ కోటా కింద ఎమ్మెల్సీకి పంపోచ్చు కాదా అని బండి సంజయ్ విమర్శించారు. పీవీ కుటుంబాన్ని అవమాన పర్చేందుకే తన కుమార్తెకు ఓడిపోయే సీటీ ఇచ్చారని, బీజేపీని ఎదుర్కొలేకే పీవీ ఫోటోలను పట్టుకుని టీఆర్ఎస్ ప్రచారం చేస్తోందని బండి సంజయ్ ఎద్దేవా చేశారు.
మిడిసి పడొద్దు
ఇక దుబ్బాక ఉప ఎన్నిక గెలుపుతో బీజేపీ నేతలు మిడిసిపడుతున్నారంటూ మంత్రి కేటీఆర్ కామెంట్ చేశారు. జీహెచ్ ఎంసీ ఎన్నికల్లో అతి పెద్ద పార్టీగా తామే అవతారించామమని, మేయర్, డిప్యూటీ మేయర్ పీఠాలను సైతం మేమే కైవసం చేసుకున్నామంటూ చేసిన కామెంట్స్‌పై బీజేపీ నేత లక్ష్మణ్ మండిపడ్డారు. తమ పార్టీకి లభిస్తున్న ప్రజాదరణను చూసి ఓర్వలేక అసహనంతో కేటీఆర్ విమర్శలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అదేవిధంగా రాబోయే నాగర్జున సాగర్ ఉప ఎన్నికలో సైతం దుబ్బాక ఫలితమే వస్తుందని బీజేపీ నాయకులు ధీమా వ్యక్తం చేస్తున్నారు.
మనమే కేంద్రానికి ఇచ్చాం
కేంద్ర ప్రభుత్వ నిధులతో రాష్ట్ర ప్రభుత్వం ఎంజాయ్ చేస్తోందని బండి సంజయ్ ఆరోపించారు. బండి సంజయ్ ఆరోపణలపై మంత్రి కేటీఆర్ మండిపడ్డారు. గత ఆరేళ్లలో తెలంగాణకు కేంద్ర ప్రభుత్వానికి ట్యాక్స్ లు, వివిధ రకాల పన్నుల రూపంలో 2లక్షల 72వేల 926 కోట్ల రూపాయలు చెల్లించిందన్నారు. అయితే ఇందులో కేంద్రం నుంచి తెలంగాణకు వచ్చింది కేవలం ఒక లక్ష 40వేల 329 కోట్ల రూపాయలేనన్నారు. దీనిని బట్టి చూస్తే రూపాయి మనం ఇస్తే.. అర్ధ రూపాయి కేంద్రం ఇస్తుందని.. దీని లెక్కన ఎవరు ఎవరికి ఇచ్చారో బండి సంజయ్ చెప్పాలంటూ కేటీఆర్ ట్వీట్ చేశారు.
ఐటీఐఆర్ గొడవ
కాంగ్రెస్ హాయంలో ఇచ్చిన ఐటీఐఆర్‌ను కూడా ఎన్డీఏ సర్కార్ రద్దు చేసిందని, ఎందుకు రద్దు చేశారో కూడా చెప్పలేని పరిస్థితిలో కేంద్రం పెద్దలున్నారని కేటీఆర్ ఫైరయ్యారు. ఇప్పుడు మాట్లాడుతున్న పెద్దలకు ఐటిఐఆర్ తిరిగి తీసుకువచ్చే దమ్ముందా? అని కేటీఆర్ ప్రశ్నిస్తున్నారు. విశాఖ ఉక్కును ప్రైవేట్ పరం చేస్తుందంటూ దుయ్య బడుతున్నారు. ఏదేమైనా బీజేపీ అధికారంలోకి వచ్చాక జీడీపీ మాత్రం బాగా పెరిగిందంటూ కేటీఆర్ సెటైర్లు వేశారు. కేటీఆర్ అబద్దాల్లో తండ్రిని మించి పోయాడని బాప్ ఏక్ నంబర్.. అయన కొడుకు దస్ నంబర్ అంటూ బండి సంజయ్ ద్వజమెత్తుతున్నారు. 13వేల కంపెనీలు..1.32 లక్షల ఉద్యోగాలు ఇచ్చినట్టు నిరూపిస్తే టీఆర్ఎస్ పల్లకీ మోస్తానని.. లేకుంటే బడితె పూజ తప్పదని బండి సంజయ్ హెచ్చరిస్తున్నారు.
ఢిల్లీలో దీక్షకు రేడీనా?
ఐటీఐఆర్, విభజన చట్టంలోని హామీలను సాధించుకునేందకు ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద నిరహార దీక్ష చేద్దాం.. ఇందుకు మంత్రి కేటీఆర్ సిద్దంగా ఉండాలి.. ఐటిఐఆర్ లాంటి పథకాలను మోడి సర్కారు అటకెక్కించింది. అప్పుడు నోరు మెదపని టీఆర్ఎస్ ఎమ్మెల్సీ ఓట్ల కోసం మాట్లడడమేమిటీ..జీహెచ్ఎంసీ ఎన్నికల సమయంలో మోడి మెడలు వంచుతానన్న కేసీఆర్.. ఢిల్లీ వెళ్లి తానె మెడలు వంచి జీ హుజూర్ అంటూ దిగిని ఫోటోలను ప్రజలు మర్చిపోరదని పీసీపీ వర్కింగ్ ప్రసిడెంట్ రేవంత్ రెడ్డి ద్వజమెత్తారు.