కరోనాతో పోరాటానికి సిద్ధమైన కంపెనీలివే!

దిశ, వెబ్‌డెస్క్: గడిచిన రెండు వారాలుగా దేశవ్యాప్తంగా కరోనాతో యుద్ధానికి ప్రభుత్వంతో పాటు అనేక సంస్థలు, వ్యక్తులు తమ తమ స్థాయిల్లో ముందుకొచ్చారు. శతాబ్దానికి ఒకసారి వచ్చే విపత్తుగా దీన్ని అధిగమించేందుకు అందరూ చేయి చేయి కలిపారు. కోటి రూపాయల వరకూ వైద్య పరికరాల వంటి విరాళంగా ఇస్తూ కార్పొరేట్ ఇండియా ప్రభుత్వానికి ఎలా సహాయపడుతోందో, ఏ ఏ కంపెనీలు ఎలాంటి సహయాన్ని అందించాయో పరిశీలిద్దాం! బజాజ్ గ్రూప్: ఆరోగ్య సమ్రక్షణలో భాగంగా మౌలిక సదుపాయాల కల్పన, […]

Update: 2020-03-30 04:41 GMT

దిశ, వెబ్‌డెస్క్: గడిచిన రెండు వారాలుగా దేశవ్యాప్తంగా కరోనాతో యుద్ధానికి ప్రభుత్వంతో పాటు అనేక సంస్థలు, వ్యక్తులు తమ తమ స్థాయిల్లో ముందుకొచ్చారు. శతాబ్దానికి ఒకసారి వచ్చే విపత్తుగా దీన్ని అధిగమించేందుకు అందరూ చేయి చేయి కలిపారు. కోటి రూపాయల వరకూ వైద్య పరికరాల వంటి విరాళంగా ఇస్తూ కార్పొరేట్ ఇండియా ప్రభుత్వానికి ఎలా సహాయపడుతోందో, ఏ ఏ కంపెనీలు ఎలాంటి సహయాన్ని అందించాయో పరిశీలిద్దాం!

బజాజ్ గ్రూప్: ఆరోగ్య సమ్రక్షణలో భాగంగా మౌలిక సదుపాయాల కల్పన, ఆహారం, ఆశ్రయం కల్పిస్తోంది ఈ సంస్థ. అలాగే, గ్రామీణ ప్రాంతాల్లో ఆర్థిక సహాయ కార్యక్రమాలకు రూ. 100 కొట్లను ఇవ్వనున్నట్టు హామీ ఇచ్చింది.

మహీంద్రా & మహీంద్రా: అతిపెద్ద దేశీయ దిగ్గజ వాహన తయారీ సంస్థ వెంటిలేటర్ల తయారీకి ముందుకొచ్చింది. వీటి తయారీ కోసం తాత్కాలిక సమ్రక్షణ సౌకర్యాల కోసం రిసార్ట్‌లను ఉపయోగించడానికి ముందుకొచ్చింది. మహీంద్రా ఫౌండేషన్ ద్వారా సహాయం చేయడానికి ఫండ్‌ను రూపొందిస్తోంది. అంతేకాకుండా మహీంద్రా గ్రూప్ ఛైర్మన్ ఆనంద్ మహీంద్రా తన వంద శాతం వేతనాన్ని విరాళంగా ఇస్తానని మాటిచ్చారు.

రిలయన్స్ ఇండస్ట్రీస్: దేశీయ అతిపెద్ద కంపెనీ ఆర్ఐఎల్..ముంబైలో కరోనా వైరస్ బారిన పడిన వారికోసం 100 పడకల కరోనా క్యూర్ కేంద్రాన్ని ఏర్పాటు చేసింది. వివిధ నగరాల్లో ఉచితంగా భోజనం, ఐసోలేషన్ సౌకర్యం, ఇతర దేశాల నుంచి వచ్చిన నిర్దేశిత ప్రయాణికులకు ప్రత్యేక వైద్య సదుపాయాలు, కాంటాక్ట్ ట్రేసింగ్ ద్వారా గుర్తించబడిన అనుమానాస్పద కేసులను అందిస్తోంది. అలాగే, రిలయన్స్ లైఫ్ సైన్సెస్ సమర్థవంతమైన పరీక్షల కోసం అదనపు పరీక్షల వస్తు సామాగ్రిని, వినియోగ వస్తువులను దిగుమతి చేస్తోంది. అలాగే ఆరోగ్య రక్షణలో పనిచేస్తున్న కార్యకర్తల కోసం లక్ష మాస్కుల ఉత్పత్తిని చేపట్టడంతో పాటు దీని పెంచే ప్రయత్నాల్లో ఉంది. వీటన్నిటితో పాటు మహారాష్ట్ర సీఎం రిలీఫ్ ఫండ్‌కు రూ. 5 కోట్ల విరాళాన్ని ప్రకటించింది.

హీరో సైకిల్స్: కరోనాతో పోరులో కేంద్రానికి సాయంగా ఆకస్మిక నిధిగా రూ. 100 కోట్లను కేటాయించింది.

టీవీఎస్ మోటార్ కంపెనీ: టీవీస్ గ్రూప్ కంపెనీ పది లక్షల వరకు మాస్కుల తయారీని చేపడుతోంది. రోజూవారి కూలీ కార్మికులకు ఆహారాన్ని సరఫరా చేయడం, వెంటిలేటర్ల తయారీకి రూ. 30 కోట్లను కేటాయినడానికి సిద్ధమైంది.

హ్యూండాయ్ ఇండియా: దక్షిణ కొరియా నుంచి 25, 000 డయాగ్నస్టిక్ కిట్‌లకు తెప్పించే ప్రయత్నాల్లో భాగంగా ఆర్డర్‌ను ఇచ్చింది.

మారుతీ సుజుకీ: దేశీయంగా అవసరమైన వెంటిలేటర్ల ఉత్పత్తిని పెంచేందుకు ఆగ్వా హెల్త్‌కేర్‌తో ఒప్పందం కుదుర్చుకుంది. ఇందులో భాగంగా ప్రజారోగ్య అవసరాలకు తగినట్టు నెలకు 10,000 వెంటిలేటర్ల తయారీని లక్ష్యంగా పెట్టుకుంది. అనుబంధ సంస్థలైన కృష్ణ మారుతీ, భారత్ సీట్లు 20 లక్షల మాస్కులను, రక్షణ దుస్తులను అందించనున్నాయి.

టాటా సన్స్: కరోనాతో పోరులో అవసరమైన కార్యకలాపాల కోసం రూ. 1000 కోట్లను ప్రకటించింది.

వేదాంత: మహమ్మారిపై పోరుకు సంస్థ మాజీ డైరెక్టర్ రూ. 100 కోట్లను కేటాయించారు.

జేఎస్‌డబ్ల్యూ: ప్రధానమంత్రి నిధికి, కరోనాతో యుద్ధానికి రూ. 100 కోట్లను కేటాయించింది.

అదానీ ఫౌండేషన్: ఈ సంస్థ కూడా ప్రధానమంత్రి నిధికి రూ. 100 కోట్లను ప్రకటించింది.

బీపీసీఎల్: కరోనా దెబ్బకు సొంత ఊళ్లకు బయలుదేరిన వలసదారుల కోసం ఆహారం, ఆశ్రయాన్ని అందించడానికి 500 పైగా ఇంధన కేంద్రాలను ఏర్పాటు చేసింది.

కోటక్ మహీంద్రా బ్యాంక్: కరోనాను ఎదుర్కొనేందుకు సహాయక చర్యల కోసం రూ. 30 కోట్ల తక్షణ సహాయాన్ని ప్రకటించింది.

యాక్సిస్ బ్యాంక్: వినియోగదారులు, ఉద్యోగులు, విక్రేతలు, ప్రభుత్వ సంస్థలకు మద్దతుగా రూ. 100 కోట్లను కేటాయించింది.

డీసీబీ బ్యాంక్: తమ కార్పొరేట్ సామాజిక బాధ్యతలో భాగంగా రూ. కోటి రూపాయలను ప్రకటించింది.

పేటీఎమ్: సంస్థ వ్యవస్థాపకుడు విజయ్ శేక్షర్ శర్మ తక్కువ వేతనం ఉన్న ఉద్యోగులకు సహాయంగా తన రెండు నెలల జీతాన్ని ఇచ్చారు.

ఇన్ఫోసిస్: కర్ణాటకలోని వెయ్యి ప్రభుత్వ పాఠశాలల్లో రూ. 20 కోట్ల ప్రాజెక్టుతో స్మార్ట్ క్లాసుల ఏర్పాటుకు ఇన్ఫోసిస్ ఫౌండేషన్ సహాయం చేయనుంది.

హెచ్‌యూఎల్: రూ. 100 కోట్లను ప్రకటించినప్పటికీ, రానున్న రోజుల్లో 2 కోట్ల లైఫ్‌బాయ్ సబ్బులను సమాజంలోని కొన్ని వర్గాలకు విరాళంగా ఇవ్వనుంది. పరీక్షా కేంద్రాలలో, ఆసుపత్రులలో ఆరోగ్య సమ్రక్షణ సౌకర్యాలను అభివృద్ధి చేయడానికి రూ. 10 కోట్లను విరాళంగా ఇవ్వనుంది.

ఐటీసీ: సమాజంలోని బలహీన వర్గాల కోసం రూ. 150 కోట్ల కరోనా ఫండ్‌ను ఏర్పాటు చేసింది. అలాగే, బలహీన వర్గాల కోసం జిల్లాల్లో ఆరోగ్య, గ్రామీణ ఆరోగ్య సమ్రక్షణ కోసం సహాయం చేయడానికి జిల్లా అధికారులకు సహకరిస్తుంది.

గోద్రేజ్ కన్స్యూమర్: 10 లక్షల ప్యాకెట్ల పంపిణీతో పాటు శానిటైజర్ల ధరను 66 శాతం తగ్గించింది.

పార్లే ఉత్పత్తులు: రానున్న మూడు వారాల్లో పార్లె సంస్థ మూడు కోట్ల బిస్కెట్ ప్యాకెట్లను అందించడాన్ని ఇప్పటికే మొదలుపెట్టింది.

సన్ ఫార్మా: కరోనాను నిలువరించేందుకు మద్దతుగా హైడ్రాక్సి క్లోరోక్విన్, అజిత్రో మైసిన్ ఇతర సంబంధిత మందులు, శానిటైజర్లతో సహా రూ. 25 లక్షల విలువైన మందులను విరాళంగా ఇవ్వడానికి సిద్ధమైంది.

Tags : coronavirus, COVID-19, companies, funds, mask

Tags:    

Similar News