లక్ష కట్టమని వలంటీర్లు బెదిరిస్తున్నారు : బోండా ఉమా

దిశ, ఏపీ బ్యూరో: అందరికీ ఇళ్లు పేరుతో వైసీపీ ప్రభుత్వం నిరుపేదలను మోసం చేస్తోందని టీడీపీ నేత బోండా ఉమా మహేశ్వరరావు ఆరోపించారు. పేదలకు 30 లక్షల ఇళ్లను ఇస్తామని చెప్పిన వైసీపీ ప్రభుత్వం ఇప్పుడు మాట తప్పిందన్నారు. అధికారంలోకి వచ్చి 28 నెలలు గడుస్తున్నా ఇళ్ల ఊసే లేదన్నారు. కొండల్లో, గుట్టల్లో సెంటు స్థలాన్ని ఇచ్చి చేతులు దులుపుకుంటున్నారని మండిపడ్డారు. నివాస యోగ్యత లేని స్థలంలో పునాదుల కోసం రూ.లక్ష కట్టాలని ఒత్తిడి చేస్తున్నారని ఆరోపించారు. […]

Update: 2021-07-17 07:07 GMT

దిశ, ఏపీ బ్యూరో: అందరికీ ఇళ్లు పేరుతో వైసీపీ ప్రభుత్వం నిరుపేదలను మోసం చేస్తోందని టీడీపీ నేత బోండా ఉమా మహేశ్వరరావు ఆరోపించారు. పేదలకు 30 లక్షల ఇళ్లను ఇస్తామని చెప్పిన వైసీపీ ప్రభుత్వం ఇప్పుడు మాట తప్పిందన్నారు. అధికారంలోకి వచ్చి 28 నెలలు గడుస్తున్నా ఇళ్ల ఊసే లేదన్నారు. కొండల్లో, గుట్టల్లో సెంటు స్థలాన్ని ఇచ్చి చేతులు దులుపుకుంటున్నారని మండిపడ్డారు. నివాస యోగ్యత లేని స్థలంలో పునాదుల కోసం రూ.లక్ష కట్టాలని ఒత్తిడి చేస్తున్నారని ఆరోపించారు.

లక్ష రూపాయలను పేదలు ఎలా తీసుకొస్తారో ప్రభుత్వమే చెప్పాలని డిమాండ్ చేశారు. పేదలందరికీ ప్రభుత్వమే ఇళ్లను నిర్మించి ఇవ్వాలని బోండా ఉమా డిమాండ్ చేశారు. డబ్బు కట్టని వారికి ఇళ్ల స్థలాలను రద్దు చేస్తామని వలంటీర్లు బెదిరిస్తున్నారని ధ్వజమెత్తారు. చంద్రబాబు హయాంలో కట్టిన టిడ్కో ఇళ్లను కూడా పూర్తి చేయలేదని విమర్శించారు. ఎన్నికల ప్రచారంలో ఇచ్చిన హామీల్లో భాగంగా పేదలందరికీ జగన్ ఇళ్లను నిర్మించి ఇవ్వాలని డిమాండ్ చేశారు.

Tags:    

Similar News