మహబూబ్‌నగర్ జిల్లా కేంద్రంలో స్వచ్ఛంద బంద్
దిశ, మహబూబ్‌నగర్: జిల్లా కేంద్రంలో కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో వ్యాపారస్తులు స్వచ్చందంగా బంద్ పాటించాలని నిర్ణయం తీసుకున్నారు. దీనిపై మంగళవారం సాయంత్రం జిల్లా పరిషత్ కార్యాలయంలో మంత్రి శ్రీనివాస్ గౌడ్ సమక్షంలో వ్యాపారస్తులు సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో మధ్యాహ్నం 2 గంటల నుంచి ఎమర్జెన్సీ మెడికల్ తదితర వ్యాపారాలు తప్ప ఇతర వ్యాపారులు నిర్వహించామని చెప్పారు. ఇదే అంశంపై మద్యం వ్యాపారులు పూర్తిగా వ్యతిరేకించినట్టుగా తెలుస్తోంది. మేము 2 ఏండ్లకు రెంటు కట్టామని, మూసివేస్తే […]
దిశ, మహబూబ్‌నగర్: జిల్లా కేంద్రంలో కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో వ్యాపారస్తులు స్వచ్చందంగా బంద్ పాటించాలని నిర్ణయం తీసుకున్నారు. దీనిపై మంగళవారం సాయంత్రం జిల్లా పరిషత్ కార్యాలయంలో మంత్రి శ్రీనివాస్ గౌడ్ సమక్షంలో వ్యాపారస్తులు సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో మధ్యాహ్నం 2 గంటల నుంచి ఎమర్జెన్సీ మెడికల్ తదితర వ్యాపారాలు తప్ప ఇతర వ్యాపారులు నిర్వహించామని చెప్పారు. ఇదే అంశంపై మద్యం వ్యాపారులు పూర్తిగా వ్యతిరేకించినట్టుగా తెలుస్తోంది. మేము 2 ఏండ్లకు రెంటు కట్టామని, మూసివేస్తే మా గడువును మరో ఏడాదికి పొగిస్తారా అని వారు వాదించారని సమాచారం. మద్యం మినహా అన్ని వ్యాపారులు 2 గంటలకే పరిమితం కావాలని మంత్రి ఆదేశించారు. ఆయన మంత్రి ఆదేశాలను వ్యాపారులు తుంగలో తొక్కారు. ఇప్పటికైనా జిల్లా అధికారులు మేల్కొని కరోనా వైరస్ వ్యాప్తిచెందకుండా చెందకుండా చర్యలు తీసుకోవాలని పలువురు జిల్లా వాసులు కోరుతున్నారు.