పీయూ లో వాలీ బాల్ సెలక్షన్స్..

దిశ, మహబూబ్ నగర్: తమిళనాడు లోని యస్ ఆర్ ఎం యూనివర్సిటీ సౌత్ జోన్ గేమ్స్ పోటీలకు పీయూ మహిళల, పురుషుల వాలీబాల్ జట్ల ఎంపిక ప్రక్రియను పీయూ వీసీ ప్రారంభించారు. మంగళవారం పాలమూరు యూనివర్సిటీ క్రీడా మైదానంలో నిర్వహించిన మహిళల, పురుషుల వాలీబాల్ సెలక్షన్స్ కు పాలమూరు యూనివర్సిటీ అనుబంధ కళాశాలల నుంచి మహిళల వాలీబాల్ జట్టుకు 40 మంది ,పురుషుల వాలీబాల్ జట్టు కు 50మంది క్రీడాకారులు పాల్గొనగా అందులో మహిళలు 18 మంది […]

Update: 2021-12-07 08:44 GMT

దిశ, మహబూబ్ నగర్: తమిళనాడు లోని యస్ ఆర్ ఎం యూనివర్సిటీ సౌత్ జోన్ గేమ్స్ పోటీలకు పీయూ మహిళల, పురుషుల వాలీబాల్ జట్ల ఎంపిక ప్రక్రియను పీయూ వీసీ ప్రారంభించారు. మంగళవారం పాలమూరు యూనివర్సిటీ క్రీడా మైదానంలో నిర్వహించిన మహిళల, పురుషుల వాలీబాల్ సెలక్షన్స్ కు పాలమూరు యూనివర్సిటీ అనుబంధ కళాశాలల నుంచి మహిళల వాలీబాల్ జట్టుకు 40 మంది ,పురుషుల వాలీబాల్ జట్టు కు 50మంది క్రీడాకారులు పాల్గొనగా అందులో మహిళలు 18 మంది ,పురుషులు 18 మందిని ఎంపిక చేశారు.

ఈ వాలీబాల్ ఎంపిక ప్రక్రియను పాలమూరు యూనివర్సిటీ వీసీ ప్రొపెసర్ యల్. బి లక్మి కాంత్ రాథోడ్, పీయూ పీడీ డాక్టర్ కె.బాల్ రాజ్ గౌడ్ ప్రారంభించారు. ఈ ఎంపిక ప్రక్రియను రిటైర్డ్ ఫిజికల్ డైరెక్టర్ చెన్న వీరయ్య, వనపర్తి డిగ్రీ కళాశాల పీడీ శ్రీనివాస్ రెడ్డి, మహిళా పీడీలు కవిత, శ్వేత, లక్మి, వాలీబాల్ కోచ్ లు శివ, పర్వేజ్ పాషా, పీఈటీ సుచేతన్ రెడ్డి లు నిర్వహించారు. ఎంపికైన మహిళల, పురుషుల వాలీబాల్ జట్లు తమిళనాడు లోని ఎస్ ఆర్ ఎం యూనివర్సిటీ లో మహిళలకు ఈ నెల 13 నుంచి 16 వరకు, పురుషులకు 18 నుంచి 22 వరకు జరిగే సౌత్ జోన్ ఇంటర్ యూనివర్సిటీ పోటీల్లో పాల్గొననున్నారు. ఎంపికైన 18 మంది క్రీడాకారులు బెస్ట్ 12 మంది క్రీడాకారులకు ప్రత్యేక శిక్షణ ఇచ్చి సౌత్ జోన్ పంపనున్నట్లు పీయూ పీడీ బాల్ రాజ్ గౌడ్ తెలిపారు.

పీయూ వీసీ ప్రొఫెసర్ లక్మి కాంత్ రాథోడ్..

వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలని పీయూ వీసీ ప్రొఫెసర్ లక్మి కాంత్ రాథోడ్ అన్నారు. వెనక బడిన ఉమ్మడి పాలమూరు జిల్లా నుంచి జాతీయ స్థాయిలో వాలీబాల్ ఆడి విజయం సాధించి పెట్టిన ఘనత మనదే అని అన్నారు. సౌత్ జోన్ గేమ్స్ పోటీలలో బాగా ఆడి యూనివర్సిటీ పేరు మన జిల్లా పేరు నిలబెట్టాలని ఆయన అన్నారు. వాలీబాల్ పీయూ మహిళల జట్టు కోసం ఉమ్మడి జిల్లా నలుమూలల నుంచి ఎక్కువ మంది హాజరు కావడం చాలా సంతోషమన్నారు. బాగా ఆడి ప్రదర్శన చూపిన వారిని పీయూ వాలీబాల్ జట్టులో స్థానం కల్పించాలని, రాజకీయాలకు తావు ఇవ్వద్దని పీడీ లకు, సెలక్టర్లకు సూచించారు.సెలక్ట్ కాని వారు నిరాశ చెందకుండా మరోమారు ప్రయత్నం చేయాలన్నారు.

Tags:    

Similar News