భారత్‌లో వీవో ఇండస్ట్రియల్ డిజైన్ సెంటర్

దిశ, వెబ్‌డెస్క్: చైనాకు చెందిన స్మార్ట్‌ఫోన్ దిగ్గజ కంపెనీ ఫోన్‌ల ఉత్పత్తిలో స్థానికత ఉండేందుకు భారత్‌లో తన ఇండస్ట్రియల్ డిజైన్ సెంటర్‌ను ఏర్పాటు చేయనున్నట్టు తెలుస్తోంది. అంతేకాకుండా, భారత్‌లో ఉద్యోగుల సంఖ్యను 50 వేలకు పెంచాలని కంపెనీ ప్రణాళిక సిద్ధం చేస్తోందని వీవో ఉన్నతాధికారి చెప్పారు. అలాగే, భవిష్యత్తులో వీవో స్మార్ట్‌ఫోన్ తయారీ సామర్థ్యాన్ని 3.3 కోట్ల నుంచి 12 కోట్లకు పెంచడానికి భారత్‌లో రూ. 7,500 కోట్ల పెట్టుబడులను కంపెనీ ప్రకటించిందని వీవో ఇండియా బ్రాండ్ […]

Update: 2020-07-16 06:09 GMT

దిశ, వెబ్‌డెస్క్: చైనాకు చెందిన స్మార్ట్‌ఫోన్ దిగ్గజ కంపెనీ ఫోన్‌ల ఉత్పత్తిలో స్థానికత ఉండేందుకు భారత్‌లో తన ఇండస్ట్రియల్ డిజైన్ సెంటర్‌ను ఏర్పాటు చేయనున్నట్టు తెలుస్తోంది. అంతేకాకుండా, భారత్‌లో ఉద్యోగుల సంఖ్యను 50 వేలకు పెంచాలని కంపెనీ ప్రణాళిక సిద్ధం చేస్తోందని వీవో ఉన్నతాధికారి చెప్పారు. అలాగే, భవిష్యత్తులో వీవో స్మార్ట్‌ఫోన్ తయారీ సామర్థ్యాన్ని 3.3 కోట్ల నుంచి 12 కోట్లకు పెంచడానికి భారత్‌లో రూ. 7,500 కోట్ల పెట్టుబడులను కంపెనీ ప్రకటించిందని వీవో ఇండియా బ్రాండ్ స్ట్రాటజీ డైరెక్టర్ నిపున్ మర్యా వెల్లడించారు. వీలైనంత తక్కువ సమయంలో భారత్‌లో ఇండస్ట్రియల్ డిజైన్ సెంటర్ ఏర్పాటును సిద్ధం చేస్తామని అన్నారు. కంపెనీ కేవలం డిజైన్ సెంటర్ ఏర్పాటు మాత్రమే కాదు డిజైన్ కూడా స్థానికంగానే చేస్తామని స్పష్టం చేశారు. భవిష్యత్తులో భారత వినియోగదారుల అవసరాలను తీర్చేలా డిజైన్ సెంటర్లను రూపు దిద్దుతామని, 2020-21 ఆర్థిక సంవత్సరంలోనే తొలి మేడ్ ఇన్ ఇండియా డిజైన్ ఉత్పత్తిని తీసుకొస్తామని నిపున్ మర్యా వివరించారు.

Tags:    

Similar News