పీకేఎల్ నుంచి కూడా తప్పుకున్న వివో

దిశ, స్పోర్ట్స్: ఇండో-చైనా ఘర్షణల నేపథ్యంలో ఇండియన్ ప్రీమియర్ లీగ్ (Indian Premier League) టైటిల్ స్పాన్సర్‌(Title sponsor)గా తప్పుకున్న చైనా మొబైల్ కంపెనీ వివో(Vivo) ఇప్పుడు మరో ఝలక్ ఇచ్చింది. మాషల్ స్పోర్ట్స్(Mashal Sports) ఆధ్వర్యంలో నిర్వహించే ప్రొఫెషనల్ కబడ్డీ లీగ్ అయిన పీకేఎల్(pro Kabaddi League) స్పాన్సర్‌(Sponsor)గా కూడా తప్పుకుంటున్నట్లు స్పష్టం చేసింది. ఏడాదికి రూ.60కోట్ల చొప్పున 5ఏళ్లకు రూ.300కోట్లు చెల్లించేలా 2017లో వివో ఒప్పందం(Agreement) కుదుర్చుకుంది. ఇటీవల చైనా ఉత్పత్తు(China products)లకు ఇండియాలో […]

Update: 2020-08-08 07:45 GMT

దిశ, స్పోర్ట్స్: ఇండో-చైనా ఘర్షణల నేపథ్యంలో ఇండియన్ ప్రీమియర్ లీగ్ (Indian Premier League) టైటిల్ స్పాన్సర్‌(Title sponsor)గా తప్పుకున్న చైనా మొబైల్ కంపెనీ వివో(Vivo) ఇప్పుడు మరో ఝలక్ ఇచ్చింది. మాషల్ స్పోర్ట్స్(Mashal Sports) ఆధ్వర్యంలో నిర్వహించే ప్రొఫెషనల్ కబడ్డీ లీగ్ అయిన పీకేఎల్(pro Kabaddi League) స్పాన్సర్‌(Sponsor)గా కూడా తప్పుకుంటున్నట్లు స్పష్టం చేసింది. ఏడాదికి రూ.60కోట్ల చొప్పున 5ఏళ్లకు రూ.300కోట్లు చెల్లించేలా 2017లో వివో ఒప్పందం(Agreement) కుదుర్చుకుంది.

ఇటీవల చైనా ఉత్పత్తు(China products)లకు ఇండియాలో తీవ్రమైన వ్యతిరేకత(Opposition) వస్తున్నది. మెగా ఈవెంట్ల(Mega events)ను స్పాన్సర్ చేయడంతో పాటు పదే పదే టీవీల్లో యాడ్స్ ఇవ్వడం వల్ల ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత వస్తున్నదని వివో భావిస్తున్నది. దీంతో ఐపీఎల్‌తో పాటు పీకేఎల్ టైటిల్ స్పాన్సర్‌(Title sponsor)గా కూడా తప్పుకుంది.

కాగా, పీకేఎల్(pro Kabaddi League 2020 సీజన్(Season) ఇప్పటికే రద్దు(Cancel)చేశారు. అయితే, తాము ఇకపై టైటిల్ స్పాన్సర్‌గా కొనసాగబోమని బ్రాడ్‌కాస్టర్ స్టార్ ఇండియా(Broadcaster Star India)కు తేల్చి చెప్పింది. మరోవైపు ఐపీఎల్ సీజన్‌లో చైనా కంపెనీలు స్టార్ ఇండియాకు యాడ్స్ కూడా తగ్గించేయాలని నిర్ణయించాయి. దీంతో స్టార్‌కు రూ.400 కోట్ల మేర ఆదాయం(Income) తగ్గనున్నట్లు విశ్లేషకులు(Analysts) భావిస్తున్నారు.

Tags:    

Similar News