ఆన్‌లైన్‌లోనే వైజ్ఞానిక ప్రదర్శనలు
దిశ, హైదరాబాద్: కరోనా కారణంగా లాక్ డౌన్ అమలవుతున్న నేపథ్యంలో వైజ్ఞానిక ప్రదర్శనలను ఆన్‌లైన్‌లోనే నిర్వహించాలని భారత శాస్త్ర, సాంకేతిక మండలి నిర్ణయించింది. ఈ మేరకు జిల్లా స్థాయి ఇన్‌స్పైర్ పోటీలను జూన్ చివర కల్లా పూర్తి చేయాలని మార్గదర్శకాలను విడుదల చేసింది. దీంతో హైదరాబాద్, మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలో జిల్లా స్థాయి ఇన్‌స్పైర్ పోటీలు జూన్ మొదటి వారంలో నిర్వహించేందుకు జిల్లా విద్యా శాఖ అధికారులు కసరత్తు చేస్తున్నారు. ఈ మేరకు ఇన్‌స్పైర్ ప్రదర్శనకు ఎంపికైన […]
దిశ, హైదరాబాద్: కరోనా కారణంగా లాక్ డౌన్ అమలవుతున్న నేపథ్యంలో వైజ్ఞానిక ప్రదర్శనలను ఆన్‌లైన్‌లోనే నిర్వహించాలని భారత శాస్త్ర, సాంకేతిక మండలి నిర్ణయించింది. ఈ మేరకు జిల్లా స్థాయి ఇన్‌స్పైర్ పోటీలను జూన్ చివర కల్లా పూర్తి చేయాలని మార్గదర్శకాలను విడుదల చేసింది. దీంతో హైదరాబాద్, మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలో జిల్లా స్థాయి ఇన్‌స్పైర్ పోటీలు జూన్ మొదటి వారంలో నిర్వహించేందుకు జిల్లా విద్యా శాఖ అధికారులు కసరత్తు చేస్తున్నారు. ఈ మేరకు ఇన్‌స్పైర్ ప్రదర్శనకు ఎంపికైన విద్యార్థులతో మోడల్స్ తయారుచేయించి సిద్ధంగా ఉంచాలని గైడ్ ఉపాధ్యాయులకు హైదరాబాద్ డిఈఓ వెంకట నర్సమ్మ, మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా డీఈఓ విజయ కుమారిలు వేరువేరుగా ఆదేశాలు జారీ చేశారు. ఈ సందర్భంగా ఒక్కో విద్యార్థికి పది వేల రూపాయలు మంజూరైనట్టు తెలిపారు. ఈ సందర్భంగా ఇన్‌స్పైర్ జిల్లా స్థాయి పోటీలకు హైదరాబాద్ జిల్లా నుంచి 157 మంది, మేడ్చల్ జిల్లా నుంచి 47 మంది విద్యార్థులు ఎంపికైనట్టు పేర్కొన్నారు. మరిన్ని వివరాలకు జిల్లా సైన్స్ అధికారులను సంప్రదిచాలని సూచించారు.