విశాఖ మెట్రోకు కొత్త డీపీఆర్
విశాఖ మెట్రో రైల్ ప్రాజెక్టుకు కొత్త డీపీఆర్ రూపకల్పన చేయాలని అమరావతి మెట్రో రైల్ ఎండీకి ఏపీ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు ప్రభుత్వం తాజా ఉత్తర్వులు వెలువరించింది. కొత్త డీపీఆర్ రూపకల్పనకు కొటేషన్స్ పిలవాలని ఉత్తర్వులులో పేర్కొన్నారు. నూతన డీపీఆర్ రూపకల్పన నిమిత్తం ఢిల్లీ మెట్రో రైల్ కార్పొరేషన్, రైట్స్, యూఎంటీసీ సంస్థలను సంప్రదించాలని ప్రభుత్వం ఆదేశించింది. […]
విశాఖ మెట్రో రైల్ ప్రాజెక్టుకు కొత్త డీపీఆర్ రూపకల్పన చేయాలని అమరావతి మెట్రో రైల్ ఎండీకి ఏపీ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు ప్రభుత్వం తాజా ఉత్తర్వులు వెలువరించింది. కొత్త డీపీఆర్ రూపకల్పనకు కొటేషన్స్ పిలవాలని ఉత్తర్వులులో పేర్కొన్నారు. నూతన డీపీఆర్ రూపకల్పన నిమిత్తం ఢిల్లీ మెట్రో రైల్ కార్పొరేషన్, రైట్స్, యూఎంటీసీ సంస్థలను సంప్రదించాలని ప్రభుత్వం ఆదేశించింది.
విశాఖలో 79.9 కిలోమీటర్ల మెట్రో రైలు నిర్మాణాన్ని మూడు కారిడార్లలో చేపట్టేందుకు ప్రణాళికలు రూపొందిస్తోంది. కాగా, గతంలో విశాఖ మెట్రో డీపీఆర్‌కు సంబంధించి ఎస్సెల్ ఇన్‌ఫ్రా కన్సార్టియంకు ఇచ్చిన ఉత్తర్వులను ప్రభుత్వం రద్దు చేసింది.