నిండు గర్భిణికీ పురుడు పోసిన సినీ రచయిత
దిశ వెబ్ డెస్క్: దేశమంతా లాక్డౌన్ కొనసాగుతున్నసమయంలో.. ఎన్నో హృదయ విదారక సంఘటనలు జరుగుతున్నాయి. ప్రధానంగా గర్భిణీలు ఎంతోమంది అవస్థలు పడుతున్నారు. ఇటీవలే ఓ డెంటిస్ట్ ఒక నిండు గర్భిణీకి పురుడు పోసింది. అంతకుముందు ఓ గర్బిణీ బస్టాండ్ లో పురుడు పోసుకుంది. తాజాగా పురుటి నొప్పులతో బాధ పడుతున్న గర్భిణికి సినీ రచయిత చంద్రన్ పురుడు పోశారు. తమిళ దర్శకుడు వెట్ట్రిమారన్ రూపొందిన చిత్రం విచారణై. ఈ చిత్రానికి ఓ ఆటో డ్రైవర్ కథ అందించడం […]
దిశ వెబ్ డెస్క్: దేశమంతా లాక్డౌన్ కొనసాగుతున్నసమయంలో.. ఎన్నో హృదయ విదారక సంఘటనలు జరుగుతున్నాయి. ప్రధానంగా గర్భిణీలు ఎంతోమంది అవస్థలు పడుతున్నారు. ఇటీవలే ఓ డెంటిస్ట్ ఒక నిండు గర్భిణీకి పురుడు పోసింది. అంతకుముందు ఓ గర్బిణీ బస్టాండ్ లో పురుడు పోసుకుంది. తాజాగా పురుటి నొప్పులతో బాధ పడుతున్న గర్భిణికి సినీ రచయిత చంద్రన్ పురుడు పోశారు. తమిళ దర్శకుడు వెట్ట్రిమారన్ రూపొందిన చిత్రం విచారణై. ఈ చిత్రానికి ఓ ఆటో డ్రైవర్ కథ అందించడం విశేషం. ఆయనే చంద్రన్. అతనే ఓ గర్భణీని డెలీవరీ చేశారు.
కరోనా కారణంగా ప్రజలంతా ఇళ్లకే పరిమితమయ్యారు. రోడ్లన్నీ నిర్మానుష్యంగా మారాయి. వైద్యులంతా కరోనా బాధితులను చూసుకోవడంలో నిమగ్నమయ్యారు. దాంతో.. చాలా ఆస్పత్రుల్లో వైద్యులు అందుబాటులో లేరు. ఈ నేపథ్యంలోనే కోవై, సింగనల్లూర్ ప్రాంతంలో ఉంటున్న ఓ భవన నిర్మాణ కార్మికురాలికి తీవ్రంగా నొప్పులు వచ్చాయి. దాంతో ఆమె కుటుంబ సభ్యులు అంబులెన్స్ కు ఫోన్ చేశారు. అది రావడం ఆలస్యం కావడంతో.. ఆ కుటుంబీకులు ఆటో డ్రైవర్ చంద్రన్ కు ఫోన్ చేశారు. చంద్రన్ వచ్చేసరికి ఆ మహిళ ప్రసవ వేదనతో బాధపడుతోంది. చంద్రన్ కు ఏం చేయాలో అర్థం కాలేదు. కరోనా భయంతో ఎవరూ సాయం చేసేందుకు ముందుకు రాలేదు. దాంతో చంద్రన్ ధైర్యం చేసి ఆ మహిళకు పురుడు పోశాడు. ఆయన ఆలస్యం చేస్తే.. గర్భిణీ ప్రాణానికే ముప్పు ఉండేదని ఆమె కుటీంబీకులు చెబుతున్నారు. ఇదిలా ఉంటే.. నిజ జీవిత సంఘటనలతో చంద్రన్ రాసుకున్న నవల ‘లాకప్’. ఆ నవల ఆధారంగే ‘విచారణై’ రూపొందింది. దాంతో ఈ ఆటోడ్రైవర్ రచయితగా మారిపోయాడు.
tags :chandran, writer, auto driver, delivery