RTPCRకు చిక్కని వైరస్.. ఎయిర్‌పోర్టు టెస్టులపై అనుమానాలు

దిశ, తెలంగాణ బ్యూరో: విదేశాల నుంచి వస్తోన్న ప్రయాణికులకు కరోనా నెగటివ్ వచ్చినా సేఫ్​కాదని వైద్య నిపుణులు చెబుతున్నారు. లక్షణాలు ఉన్నా, చాలా మందికి వ్యాధి నిర్ధారణ కావడం లేదు. ఈ కొత్త వేరియంట్​ఆర్ టీపీసీఆర్​టెస్టు నుంచి తప్పించుకుంటుంది. అయినా క్వారంటైన్‌‌‌లో ఉండాలని ఎయిర్​పోర్ట్​అధికారులు సూచిస్తున్నారు. కానీ, అనేకమంది వైరస్​లేదులే అనే భ్రమతో విచ్చలవిడిగా తిరిగేస్తున్నారు. ఇక నాన్ రిస్క్​దేశాల నుంచి వచ్చినోళ్లకైతే ఎయిర్​పోర్టులో శాంపిల్​ తీసుకొని పంపించేస్తున్నారు. ఇక్కడే అసలు సమస్య మొదలైంది. ఆ శాంపిల్​ […]

Update: 2021-12-15 19:00 GMT

దిశ, తెలంగాణ బ్యూరో: విదేశాల నుంచి వస్తోన్న ప్రయాణికులకు కరోనా నెగటివ్ వచ్చినా సేఫ్​కాదని వైద్య నిపుణులు చెబుతున్నారు. లక్షణాలు ఉన్నా, చాలా మందికి వ్యాధి నిర్ధారణ కావడం లేదు. ఈ కొత్త వేరియంట్​ఆర్ టీపీసీఆర్​టెస్టు నుంచి తప్పించుకుంటుంది. అయినా క్వారంటైన్‌‌‌లో ఉండాలని ఎయిర్​పోర్ట్​అధికారులు సూచిస్తున్నారు. కానీ, అనేకమంది వైరస్​లేదులే అనే భ్రమతో విచ్చలవిడిగా తిరిగేస్తున్నారు. ఇక నాన్ రిస్క్​దేశాల నుంచి వచ్చినోళ్లకైతే ఎయిర్​పోర్టులో శాంపిల్​ తీసుకొని పంపించేస్తున్నారు. ఇక్కడే అసలు సమస్య మొదలైంది. ఆ శాంపిల్​ నిర్ధారణ తర్వాత సదరు వ్యక్తులకు పాజిటివా? నెగెటివా? అనేది అధికారులు సమాచారం ఇవ్వడం లేదు. దీంతో వారు బహిరంగ ప్రదేశాల్లో విస్తృతంగా తిరుగుతున్నారు. ఆ తర్వాత ర్యాండమ్‌గా చేస్తున్న జీనోమ్ సీక్వెన్సింగ్‌లో తేలుతున్న ఒమిక్రాన్‌ని చూసి ఆందోళనకు గురవుతున్నారు.

బుధవారం తేలిన రెండు కేసుల్లోనూ ఇదే జరిగింది. అంతకు ముందు కూడా హైదరాబాద్​కుత్భుల్లాపూర్‌కు చెందిన ఓ మహిళకు ఎయిర్​పోర్టులో నెగటివ్​రిపోర్టు ఇచ్చారు. తర్వాత ఆమె ఇంటికి చేరుకున్నది. ఆ వెంటనే పాజిటివ్​ వచ్చిందంటూ అధికారులు హడవుడి చేస్తూ ఆమెను టిమ్స్‌కు తరలించడం గమనార్హం. అయితే ఆమెకు ఒమిక్రాన్ తేలకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. ఈ క్రమంలో అసలు ఎయిర్​పోర్టులో చేస్తున్న టెస్టులపై పలువురికి అనుమానాలు నెలకొన్నాయి. టెస్టింగ్​ప్రక్రియ సజావుగా జరుగుతుందో లేదోనని ఆందోళన చెందుతున్నారు. ఇలాంటి పరిస్థితులు వ్యాధి వ్యాప్తిని మరింత రెట్టింపు చేస్తాయని వైద్యాధికారులు టెన్షన్​పడుతున్నారు.

అలెర్ట్..

ఒమిక్రాన్​తేలడంతో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. నాన్​రిస్క్​కంట్రీస్​నుంచి వచ్చినోళ్లపై కూడా ఇక నుంచి నిఘా పెట్టనుంది. గత 15 రోజుల నుంచి ఎయిర్​పోర్టులలో పాజిటివ్​వచ్చినోళ్లతో పాటు నెగెటివ్​వ్యక్తులను ట్రేసింగ్​చేయనున్నారు. ఈ మేరకు వైద్యశాఖతో పాటు పోలీస్, రెవెన్యూ శాఖలకు ట్రేసింగ్​బాధ్యతలను అప్పగించింది. అనుమానితులు, ప్రైమరీ కాంటాక్ట్‌లకు ఫోకస్​పెట్టనున్నారు. లక్షణాలు ఉంటే వెంటనే టెస్టులు చేసి క్వారంటైన్‌కు తరలించనున్నారు. దీంతో పాటు ఇప్పటికే నాన్​రిస్క్​దేశాల నుంచి వచ్చిన పాజిటివ్‌లను కూడా మానిటరింగ్​చేయనున్నారు. ఒమిక్రాన్​అంశంపై ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రి హరీష్​రావు ఆధ్వర్యంలో ప్రత్యేక సమీక్ష కూడా జరగనున్నట్లు సమాచారం.

Tags:    

Similar News