రేపు బాగ్‌లింగంపల్లిలో వర్చువల్ సమావేశం

దిశ, న్యూస్‌బ్యూరో: కరోనా నియంత్రణలో కేంద్ర, రాష్ట్రాలు విఫలం అయ్యాయని నేతలు విమర్శించారు. ఆదివారం సీపీఐ రాష్ట్ర కార్యాలయంలో చాడ వెంకటరెడ్డి అధ్యక్షతన జరిగిన సమావేశంలో నర్సింగరావు, కోదండరాం, చలపతిరావు, ఆర్. గోవింద్‌ పాల్గొన్నారు. ఈ సందర్భంగా కార్యాచరణ ప్రకటించారు. జులై 27న బాగ్‌లింగంపల్లి సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో వర్చువల్ రౌండ్ టేబుల్ సమావేశం, జులై 30న జిల్లా కేంద్రాల్లో నల్ల జెండాలతో నిరసనగా వెళ్లి కలెక్టర్‌కు వినతి పత్రాలు ఇవ్వనున్నట్లు తెలిపారు. 28 నుంచి ఆగస్టు […]

Update: 2020-07-26 10:39 GMT

దిశ, న్యూస్‌బ్యూరో: కరోనా నియంత్రణలో కేంద్ర, రాష్ట్రాలు విఫలం అయ్యాయని నేతలు విమర్శించారు. ఆదివారం సీపీఐ రాష్ట్ర కార్యాలయంలో చాడ వెంకటరెడ్డి అధ్యక్షతన జరిగిన సమావేశంలో నర్సింగరావు, కోదండరాం, చలపతిరావు, ఆర్. గోవింద్‌ పాల్గొన్నారు. ఈ సందర్భంగా కార్యాచరణ ప్రకటించారు.

జులై 27న బాగ్‌లింగంపల్లి సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో వర్చువల్ రౌండ్ టేబుల్ సమావేశం, జులై 30న జిల్లా కేంద్రాల్లో నల్ల జెండాలతో నిరసనగా వెళ్లి కలెక్టర్‌కు వినతి పత్రాలు ఇవ్వనున్నట్లు తెలిపారు. 28 నుంచి ఆగస్టు 4వరకు వెబినార్‌లు ఉంటాయన్నారు. ఆగస్టు 2న విస్తృతస్థాయిలో కొవిడ్‌పై కేంద్ర, రాష్ట్రాల వైఫల్యాన్ని ఎండగడుతూ వర్చువల్ రచ్చబండ పేరిట బహిరంగ సభ జరుగుతుందని పేర్కొన్నారు.

Tags:    

Similar News