విరుష్క కూతురి పేరు.. ‘సిడ్నీ’?
దిశ, వెబ్డెస్క్ : నాగ చైతన్య, సమంతతో జతకడితే.. ‘చైసామ్’. నిహారిక, చైతన్య ఏకమైతే ‘నిశ్చయ్’. అనుష్క, విరాట్ల కలయిక ‘విరుష్క’.. ఇలా ఇద్దరి పేర్లను కలిపి ఒకే పేరుగా అల్లేయడం లేటెస్ట్ ట్రెండ్. కాగా పలు నూతన జంటలు తమ పెళ్లికి ఇలాంటి నేమింగ్ బోర్డ్లతోనే డిజిటల్ ఆహ్వానం పలుకుతున్నారు. ఇక బిగ్బాస్ ఫేమ్ అవినాష్, అరియానాలు కాసేపు ఆ ఇంట్లో కలివిడిగా ఉన్నారో లేదో.. ఆ జంటకు ‘అవియానా’గా నామకరణం చేసేశారు. అయితే ఇదో […]
దిశ, వెబ్డెస్క్ : నాగ చైతన్య, సమంతతో జతకడితే.. ‘చైసామ్’. నిహారిక, చైతన్య ఏకమైతే ‘నిశ్చయ్’. అనుష్క, విరాట్ల కలయిక ‘విరుష్క’.. ఇలా ఇద్దరి పేర్లను కలిపి ఒకే పేరుగా అల్లేయడం లేటెస్ట్ ట్రెండ్. కాగా పలు నూతన జంటలు తమ పెళ్లికి ఇలాంటి నేమింగ్ బోర్డ్లతోనే డిజిటల్ ఆహ్వానం పలుకుతున్నారు. ఇక బిగ్బాస్ ఫేమ్ అవినాష్, అరియానాలు కాసేపు ఆ ఇంట్లో కలివిడిగా ఉన్నారో లేదో.. ఆ జంటకు ‘అవియానా’గా నామకరణం చేసేశారు. అయితే ఇదో రకం పేర్ల సమీకరణమైతే, భార్యాభర్తలిద్దరి పేర్లు కలిసొచ్చేలా.. తమ ప్రేమకు ప్రతిరూపంగా పుట్టిన బిడ్డకు పెట్టడం మరో సంకలనం. టాలీవుడ్ స్టైలిష్ స్టార్ సైతం తన కూతురికి ఈ విధంగానే తమ పేర్లలోని చివరి అక్షరాలను కలిపి అర్హ(అర్జున్, స్నేహ)అని పెట్టారు. తాజాగా విరుష్క జంటకు బిడ్డ పుట్టడంతో.. వారికి పలువురు నెటిజన్లు ఇదేతరహా పేర్లను సూచిస్తుండటం గమనార్హం.
టీమీండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ, సతీమణి అనుష్క సోమవారం తల్లిదండ్రులైన విషయం తెలిసిందే. అనుష్క మహాలక్ష్మి లాంటి ఆడబిడ్డకు జన్మనిచ్చింది. ఈ విషయాన్ని కోహ్లీ సోషల్ మీడియాలో పంచుకోగానే శుభాకాంక్షలు వెల్లువెత్తుతాయి. దీంతో పాటే నెటిజన్లు విరుష్క జంట తమ బిడ్డకు ఏం పేరు పెడతారో ఊహిస్తూ, తమదైన పేర్లను సూచిస్తున్నారు. అనుష్క, విరాట్ కలిసి ‘విరుష్క’గా మారితే, ఆ ఇద్దరి పేర్లలోని మరో సగాన్ని మిళితం చేసి ‘అనువి’గా పెట్టాలని ఓ నెటిజన్ సూచించాడు. అంతేకాదు ‘అనువి’ అంటే అనుభవం అని అర్థాన్ని కూడా వివరించాడు. ‘బ్రియాన్ లారా తన కూతురికి ‘సిడ్నీ’ అని పెట్టుకున్నాడని, విరాట్ కూతురు పుట్టినరోజున కూడా టీమీండియా అద్భుతంగా పోరాడిందని, అందుకు గుర్తుగా ఆయన కూడా ‘సిడ్నీ’ పేరు పెట్టుకుంటే బాగుంటుంది’ అని మరో నెటిజన్ ట్వీట్ చేశాడు. ఇంకాస్త ముందడుగు వేసిన మరో నెటిజన్.. పుజారా, రిషబ్, విహారిల అద్భుత పోరాటానికి సంకేతంగా ‘పురివి’ అని పెట్టుకోవాలని సూచించాడు. ఈ క్రమంలోనే అన్వి, అన్విత, వినుష్క, ఇరష్క, (ira+shka), విరుష్క వంటి పేర్లను సూచించారు.
నెటిజన్ల అత్యుత్సాహంతో పాటు, మీడియా హడావిడి చేయడంపై ఇప్పటికే అనుష్క చాలాసార్లు కోప్పడింది. రీసెంట్గా విరాట్, తను బాల్కనీలో కూర్చున్న ఫొటో విషయంలోనూ అందరికీ గట్టిగానే వార్నింగ్ ఇవ్వగా, తమకు పుట్టబోయే బిడ్డను మీడియా అటెన్షన్కు దూరంగా పెంచాలనుకుంటున్నానని, తమ ప్రైవసీకి భంగం కలిగించవద్దని స్ట్రిక్ట్గానే చెప్పింది.
ఇక విరాట్ కోహ్లీ కూతుర్ని చూడాలని విరుష్క అభిమానులు కోరుకుంటుండగా, కోహ్లీ సోదరుడు వికాస్ ఓ పాపను ఎత్తుకున్న ఫొటో ప్రస్తుతం నెట్టింట్లో వైరల్గా మారింది. అది కోహ్లీ కుమార్తెదేనని అందరూ భావిస్తుండగా, అది ప్రతీకాత్మక చిత్రమని తెలిసింది.