విరాట్ కోహ్లీ అన్ని ఫార్మాట్ల కెప్టెన్సీ వదిలేస్తాడు.. షాకింగ్ కామెంట్స్ మాజీ కోచ్

దిశ, వెబ్‌డెస్క్: టీమ్ ఇండియా టెస్టు, వన్డే జట్ల కెప్టెన్సీకి విరాట్ కోహ్లీ త్వరలో పూర్తిగా గుడ్ బై చెప్పే అవకాశాలు ఉన్నట్లు మాజీ కోచ్ రవిశాస్త్రి అన్నాడు. హెడ్ కోచ్‌గా బాధ్యతలు ముగిసిన అనంతరం ఒక జాతీయ పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో శాస్త్రి పలు విషయాలు చర్చించాడు. ‘సుదీర్ఘ ఫార్మాట్‌లో గత ఐదేళ్లుగా భారత జట్టు కోహ్లీ నేతృత్వంలో నెంబర్ 1 జట్టుగా కొనసాగింది. అతడు మానసికంగా అలసి పోయి ఉండి.. బ్యాటింగ్‌పై దృష్టి పెట్టాలని […]

Update: 2021-11-12 11:04 GMT

దిశ, వెబ్‌డెస్క్: టీమ్ ఇండియా టెస్టు, వన్డే జట్ల కెప్టెన్సీకి విరాట్ కోహ్లీ త్వరలో పూర్తిగా గుడ్ బై చెప్పే అవకాశాలు ఉన్నట్లు మాజీ కోచ్ రవిశాస్త్రి అన్నాడు. హెడ్ కోచ్‌గా బాధ్యతలు ముగిసిన అనంతరం ఒక జాతీయ పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో శాస్త్రి పలు విషయాలు చర్చించాడు. ‘సుదీర్ఘ ఫార్మాట్‌లో గత ఐదేళ్లుగా భారత జట్టు కోహ్లీ నేతృత్వంలో నెంబర్ 1 జట్టుగా కొనసాగింది. అతడు మానసికంగా అలసి పోయి ఉండి.. బ్యాటింగ్‌పై దృష్టి పెట్టాలని అనుకుంటే కోహ్లీ తప్పకుండా అన్ని ఫార్మాట్ల కెప్టెన్సీకి వీడ్కోలు పలుకుతాడు. ఇది ఇప్పటికిప్పుడే జరగక పోవచ్చు. టీ20 ఫార్మాట్ కెప్టెన్సీని వదిలేయడానికి కూడా చాలా కాలం ఆలోచించి నిర్ణయం తీసుకున్నాడు.

అలాగే మిగిలిన ఫార్మాట్ల కోసం కొంత సమయం తీసుకునే అవకాశం ఉన్నది. వన్డే కెప్టెన్సీకి కూడా గుడ్ బై చెప్పి కేవలం టెస్ట్ కెప్టెన్సీకే పరిమితం అయ్యే అవకాశాలు కూడా ఉన్నాయి. అతడి మనసు, శరీరం ఎలా చెబితే అతడు ఆ నిర్ణయం తీసుకుంటాడు. గతంలో ఎంతో మంది విజయవంతమైన కెప్టెన్లు ఇలాంటి నిర్ణయాలు తీసుకున్నారు. కోహ్లీ ఏమీ మొదటి వాడు, చివరి వాడు కాదు’ అని రవిశాస్త్రి చెప్పుకొచ్చాడు.

Tags:    

Similar News