WTC లో ఓడితే క్రికెట్ ఏమీ ఆగిపోదు : విరాట్ కోహ్లీ

దిశ, స్పోర్ట్స్: ఐసీసీ నిర్వహిస్తున్న డబ్ల్యూటీసీ ఫైనల్‌లో ఓడినా.. గెలిచినా క్రికెట్ ఏమీ ఆగిపోదని టీమ్ ఇండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ వ్యాఖ్యానించాడు. ఐదు రోజుల్లో టీమ్ ఇండియా ప్రతిభను అంచనా వేయడం కుదరదని.. అన్ని మ్యాచ్‌ల లాగానే ఇది కూడా ఒక సాధారణ ఫైనల్ అని కోహ్లీ పేర్కొన్నాడు. గత నాలుగేళ్లుగా టీమ్ ఇండియా ఆట ఇలాగే సాగుతున్నది. ఏ మ్యాచ్‌పై కూడా విపరీతమైన అంచనాలు పెంచుకొని భయపడలేదు. ఎన్నో మ్యాచ్‌లలో ఎంతో మంది ఓడిపోయారు. […]

Update: 2021-06-18 11:33 GMT

దిశ, స్పోర్ట్స్: ఐసీసీ నిర్వహిస్తున్న డబ్ల్యూటీసీ ఫైనల్‌లో ఓడినా.. గెలిచినా క్రికెట్ ఏమీ ఆగిపోదని టీమ్ ఇండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ వ్యాఖ్యానించాడు. ఐదు రోజుల్లో టీమ్ ఇండియా ప్రతిభను అంచనా వేయడం కుదరదని.. అన్ని మ్యాచ్‌ల లాగానే ఇది కూడా ఒక సాధారణ ఫైనల్ అని కోహ్లీ పేర్కొన్నాడు. గత నాలుగేళ్లుగా టీమ్ ఇండియా ఆట ఇలాగే సాగుతున్నది. ఏ మ్యాచ్‌పై కూడా విపరీతమైన అంచనాలు పెంచుకొని భయపడలేదు. ఎన్నో మ్యాచ్‌లలో ఎంతో మంది ఓడిపోయారు. అయినంత మాత్రాన ఆట ఆగిపోయింది. ఇదొక క్రీడ మాత్రమే. మేం ఫైనల్ గెలిచినా, ఓడినా క్రికెట్ మాత్రం ఇక్కడితో ఆగిపోదు అని కోహ్లీ అన్నాడు. ఆట ఆడే ప్రతీ క్రికెటర్‌కు ఇదొక మ్యాచ్.

బయట నుంచి చూసే వాళ్లే ఆతృతగా చూస్తుంటారు అని చెప్పాడు. మేం మ్యాచ్ ఫలితంతో సంబంధం లేకుండా ఆటలో కొనసాగుతాం. 2011 ప్రపంచకప్ గెలిచిన తర్వాత కూడా సాధారణంగానే గడిపేశాము. జీవితం అంటే గెలుపోటములను సమానంగా తీసుకుంటూ ఆటను ఆస్వాదించాలి అని కోహ్లీ స్పష్టం చేశాడు. మా తుది జట్టు సమతూకంగా ఉన్నది. అన్ని విభాగాలను సరి చూసుకొని ఆటగాళ్లను తీసుకున్నాము. ఫైనల్ చేరడానికి చాలా కష్టపడ్డాము. ఈ మ్యాచ్ కూడా జట్టుగా సమిష్టిగానే కష్టపడతాము అని కెప్టెన్ కోహ్లీ అన్నాడు.

Tags:    

Similar News