శ్రద్ధగా పేపర్ చదువుతున్న శునకం.. డోంట్ డిస్ట్రబ్!
దిశ, ఫీచర్స్ : న్యూస్ పేపర్‌ను ఇప్పటి వరకు మనుషులు మాత్రమే చదువుతారని తెలుసు. కానీ ఈ వీడియో చూశాక, ఆ అభిప్రాయాన్ని మార్చుకోవాల్సిందే. ఎందుకంటే ఇక్కడో శునకం శ్రద్ధగా వార్తా పత్రిక చదువుతోంది. మీరు చదివింది నిజమే! ఇన్‌స్టా యూజర్ ఒకరు.. తన పెంపుడు కుక్క శ్రద్ధగా వార్తాపత్రిక చదివి న్యూస్ తెలుసుకుంటున్న వీడియో షేర్ చేయగా, సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఆ డాగ్ ఓనర్ ‘గుడ్ బాయ్ నువ్వు వార్తలు తెలుసుకుంటున్నావు. నిన్ను […]
దిశ, ఫీచర్స్ : న్యూస్ పేపర్‌ను ఇప్పటి వరకు మనుషులు మాత్రమే చదువుతారని తెలుసు. కానీ ఈ వీడియో చూశాక, ఆ అభిప్రాయాన్ని మార్చుకోవాల్సిందే. ఎందుకంటే ఇక్కడో శునకం శ్రద్ధగా వార్తా పత్రిక చదువుతోంది. మీరు చదివింది నిజమే! ఇన్‌స్టా యూజర్ ఒకరు.. తన పెంపుడు కుక్క శ్రద్ధగా వార్తాపత్రిక చదివి న్యూస్ తెలుసుకుంటున్న వీడియో షేర్ చేయగా, సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
ఆ డాగ్ ఓనర్ ‘గుడ్ బాయ్ నువ్వు వార్తలు తెలుసుకుంటున్నావు. నిన్ను డిస్ట్రబ్ చేయొద్దని చెప్తున్నావు కూడా’ అనే క్యాప్షన్‌తో ఇన్‌స్టాగ్రామ్‌లో వీడియో పోస్ట్ చేశాడు. కాగా ఈ హిలేరియస్ వీడియో చూసి నెటిజన్లు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. కాగా హౌస్‌లోని కౌచ్‌లో కంఫర్టబుల్‌గా కూర్చున్న ఈ డాగ్.. వైట్ షర్ట్, గాగుల్స్ ధరించి జెంటిల్‌మ్యాన్ లుక్‌లో సూపర్ స్టైలిష్‌గా కనిపిస్తోంది. ఇక ఈ వీడియోకు తెగ లైక్‌లు వస్తుండటంతో పాటు ప్రశంసలు లభిస్తున్నాయి. ప్రతీ ఒక్కరు తమ పెంపుడు కుక్కలను ఇలా స్టైలిష్‌గా తయారు చేయాలని, పేపర్ రీడింగ్ నేర్పించాలని పలువురు సిల్లీ కామెంట్స్ చేస్తున్నారు.