కార్ల షోరూమ్‌లో సేల్స్ ఆఫీసర్‌గా.. స్ట్రీట్ డాగ్

దిశ, వెబ్‌డెస్క్: శునకాలను చాలా మంది అల్లారుముద్దుగా పెంచుకుంటూ, తమ కుటుంబ సభ్యుల్లా చూసుకుంటారు. కొంతమంది ఏకంగా తమ ఆస్తిలో వాటా కూడా ఇచ్చిన సందర్భాలున్నాయి. ఈ క్రమంలో ఇప్పటికే కొన్ని సంస్థలు, ఆఫీసుల్లో శునకాలకు, పిల్లులకు ఉద్యోగం కూడా కల్పిస్తున్నారు. కాగా, ఇటీవలే బ్రెజిల్‌లోని హ్యుందాయ్ షోరూమ్ నిర్వాహకులు ఓ కుక్కను ‘సేల్స్ ఆఫీసర్’గా నియమించుకోవడం విశేషం. బ్రెజిల్‌లోని హ్యుందాయ్ షోరూమ్‌కు వెళ్తే.. ఓ కుక్క హుందాగా తయారై, మెడలో ఐడీ కార్డు వేసుకుని అక్కడికి […]

Update: 2020-08-13 05:37 GMT

దిశ, వెబ్‌డెస్క్: శునకాలను చాలా మంది అల్లారుముద్దుగా పెంచుకుంటూ, తమ కుటుంబ సభ్యుల్లా చూసుకుంటారు. కొంతమంది ఏకంగా తమ ఆస్తిలో వాటా కూడా ఇచ్చిన సందర్భాలున్నాయి. ఈ క్రమంలో ఇప్పటికే కొన్ని సంస్థలు, ఆఫీసుల్లో శునకాలకు, పిల్లులకు ఉద్యోగం కూడా కల్పిస్తున్నారు. కాగా, ఇటీవలే బ్రెజిల్‌లోని హ్యుందాయ్ షోరూమ్ నిర్వాహకులు ఓ కుక్కను ‘సేల్స్ ఆఫీసర్’గా నియమించుకోవడం విశేషం.

బ్రెజిల్‌లోని హ్యుందాయ్ షోరూమ్‌కు వెళ్తే.. ఓ కుక్క హుందాగా తయారై, మెడలో ఐడీ కార్డు వేసుకుని అక్కడికి వచ్చే కస్టమర్లను సాదరంగా స్వాగతించడం చూస్తే నిజంగా ఆశ్చర్యపోతారు. ఈ షోరూమ్ నిర్వాహకులు ఓ స్ట్రీట్ డాగ్‌ను దత్తత తీసుకొని, దానికి ఈ ఉద్యోగం ఇచ్చారు. అంతేకాదు హ్యుందాయ్ కంపెనీ తయారుచేసిన ఓ కారు పేరైన ‘టక్సన్‌’ను ఈ కుక్కకు పెట్టారు. ఈ కుక్కకు సోషల్ మీడియాలోనూ విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ఇన్‌స్టాగ్రామ్‌లో ఏకంగా 28 వేల వరకు ఫాలోవర్స్ ఉండటం విశేషం.

‘టక్సన్.. ఈ వీధి కుక్క నిత్యం షోరూమ్ ఏరియాలోనే తిరుగుతూ ఉండేది. క్రమంగా హ్యుందాయ్ షోరూమ్ స్టాఫ్‌తో ఆ కుక్కకు మంచి స్నేహం ఏర్పడింది. దాంతో షోరూమ్ నిర్వాహకులు ఆ కుక్కను దత్తత తీసుకోవడంతో పాటు ఉద్యోగం కూడా కల్పించారు’. అంతేకాదు, హ్యుందాయ్ అఫీషియల్ పేజీలో టక్సన్ గురించి చెబుతూ ‘మీట్ టక్సన్ ప్రైమ్.. హ్యూందాయ్‌లో కొత్తగా జాయిన్ అయిన సేల్స్ డాగ్. ద న్యూ మెంబర్ ఆఫ్ అవర్ ఫ్యామిలీ’ అంటూ దాన్ని ఇంట్రడ్యూస్ చేశారు. దాంతో ఈ న్యూస్ వైరల్ అయ్యింది.

Tags:    

Similar News