జీతం ఇవ్వలేదని తగలబెట్టారు
దిశ, వెబ్‌డెస్క్: కర్ణాటకలో ఉద్యోగుల ఆందోళన విధ్వంసానికి దారి తీసింది. కోలార్ జిల్లాలోని నర్సాపూర్‌లో ఐఫోన్ మ్యానుఫాక్షర్ ప్లాంట్‌లో ఈ ఘటన వెలుగుచూసింది. 4 నెలలుగా జీతాలు చెల్లించడం లేదని విస్ట్రాన్ ఉద్యోగులు ఆందోళన చేపట్టారు. ఈ నేపథ్యంలోనే కంపెనీ కార్యాలయానికి నిప్పుపెట్టారు. కర్రలు, రాడ్లు తీసుకొచ్చి కార్లు, కంపెనీ భవనంలోని ఫర్నీచర్‌ను ధ్వంసం చేశారు. దీనికి తోడు మంటల ధాటికి కూడా చాలా వరకు సామాను దగ్ధం అయింది. సమాచారం అందుకున్న పోలీసులు కంపెనీ […]
దిశ, వెబ్‌డెస్క్: కర్ణాటకలో ఉద్యోగుల ఆందోళన విధ్వంసానికి దారి తీసింది. కోలార్ జిల్లాలోని నర్సాపూర్‌లో ఐఫోన్ మ్యానుఫాక్షర్ ప్లాంట్‌లో ఈ ఘటన వెలుగుచూసింది. 4 నెలలుగా జీతాలు చెల్లించడం లేదని విస్ట్రాన్ ఉద్యోగులు ఆందోళన చేపట్టారు. ఈ నేపథ్యంలోనే కంపెనీ కార్యాలయానికి నిప్పుపెట్టారు. కర్రలు, రాడ్లు తీసుకొచ్చి కార్లు, కంపెనీ భవనంలోని ఫర్నీచర్‌ను ధ్వంసం చేశారు. దీనికి తోడు మంటల ధాటికి కూడా చాలా వరకు సామాను దగ్ధం అయింది. సమాచారం అందుకున్న పోలీసులు కంపెనీ వద్దకు చేరుకొని లాఠీ చార్జీ చేశారు. దీంతో అక్కడ ఒక్కసారిగా ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. అయితే, విస్ట్రాన్ కంపెనీలో ఐఫోన్ స్పేర్ పార్టులు తయారుచేస్తారు.