కరోనా కాలంలోనూ ప్రగతిని సాధించాలి

దిశ, న్యూస్‌బ్యూరో: కరోనాతో ఖనిజ పరిశ్రమ తీవ్రంగా నష్టపోతుందని, విపత్కర పరిస్థితుల్లోనూ ప్రగతిని సాధించాలని రాష్ట్ర ప్రణాళిక సంఘం వైస్ ఛైర్మన్ వినోద్‌కుమార్ సూచించారు. ప్రగతికి అనువుగా మార్చుకునేందుకు వ్యూహరచన చేయాలని, నిర్ధిష్టమైన సూచనలతో నివేదికను సమర్పించాలని ఆయన ఇంజినీర్లను కోరారు. శనివారం ఇన్‌స్టిట్యూట్ ఆఫ్‌ ఇంజినీర్స్‌ ఆధ్వర్యంలో ‘‘ఖనిజ పరిశ్రమలపై కొవిడ్‌-19 ప్రభావం’’ అనే అంశంపై నిర్వహించిన వెబినార్‌‌లో ఆయన ప్రసంగించారు. కొవిడ్‌ అన్ని దేశాల్లోని పరిశ్రమలపై ఉందని, చైనాలో గల విదేశీ పరిశ్రమలు భారత్‌ […]

Update: 2020-06-13 08:28 GMT

దిశ, న్యూస్‌బ్యూరో: కరోనాతో ఖనిజ పరిశ్రమ తీవ్రంగా నష్టపోతుందని, విపత్కర పరిస్థితుల్లోనూ ప్రగతిని సాధించాలని రాష్ట్ర ప్రణాళిక సంఘం వైస్ ఛైర్మన్ వినోద్‌కుమార్ సూచించారు. ప్రగతికి అనువుగా మార్చుకునేందుకు వ్యూహరచన చేయాలని, నిర్ధిష్టమైన సూచనలతో నివేదికను సమర్పించాలని ఆయన ఇంజినీర్లను కోరారు. శనివారం ఇన్‌స్టిట్యూట్ ఆఫ్‌ ఇంజినీర్స్‌ ఆధ్వర్యంలో ‘‘ఖనిజ పరిశ్రమలపై కొవిడ్‌-19 ప్రభావం’’ అనే అంశంపై నిర్వహించిన వెబినార్‌‌లో ఆయన ప్రసంగించారు. కొవిడ్‌ అన్ని దేశాల్లోని పరిశ్రమలపై ఉందని, చైనాలో గల విదేశీ పరిశ్రమలు భారత్‌ వైపు చూస్తున్న పరిస్థితి నెలకొందన్నారు. ఖనిజ పరిశ్రమల్లో మహిళలకు ఉద్యోగావకాశాలు కల్పించడానికి పార్లమెంటులో పోరాటం చేశానని, ఈ మేరకు 1952 బిల్లులకు సవరణలు చేసినట్లు గుర్తుచేశారు. ఖనిజ పరిశ్రమల ఇంజినీర్లు కొవిడ్‌ జాగ్రత్తలు తీసుకుంటూ ఉత్పత్తి, ఉత్పాదకత పెంపుదలకు కృషి చేయాలన్నారు. కొవిడ్‌-19 నుండి విముక్తి లభించేంత వరకూ వ్యక్తిగతంగా జాగ్రత్తలు తీసుకోవడంతో పాటు కొత్త ఆవిష్కరణలు, ఆలోచనా విధానాలకు రూపకల్పన చేయాలని, మెదడుకు పదును పెట్టాలని సూచించారు. జాతీయ మినరల్‌ ఎక్స్‌ ప్లోరేషన్‌ ట్రస్టు- కొత్త ప్రాజెక్టు చేపట్టే విషయంపైన, డీఎంటీఎఫ్టీ నిధుల వినియోగం, బొగ్గు గనుల వేలం, కమర్షియల్‌ మైనింగ్‌, మైనింగ్‌ ఎక్విప్‌ మెంట్‌ తయారీ- ఆధునిక మైనింగ్‌ పద్ధతుల కోసం విదేశీ పెట్టుబడుల్లో తెలంగాణ అవకాశం ఇవ్వడం వంటి అంశాలపై నిర్ధిష్టమైన నివేదికలను సమర్పించాలన్నారు.

వినోద్‌ కుమార్ పరిశ్రమ రంగానికి చేసిన సేవలపై ఐఈఈ ప్రశంసలు కురిపించింది. ఖనిజ పరిశ్రమల్లో మహిళలకు అవకాశం కల్పించడంలో వినోద్‌‌కుమార్‌ చేసిన కృషి యావత్‌ మహిళ లోకానికి మేలు చేసిందన్నారు. ఆయన ప్రత్యేక చొరవ వల్లనే జేఎన్టీయూలోని మైనింగ్‌ మిషనరీ కోర్సును మెకానికల్‌ ఇంజినీరింగ్‌ కోర్సుతో సమానంగా గుర్తింపు సాధించారన్నారు. వెబినార్‌ టెక్నికల్‌ సదస్సును రాష్ట్ర ఉన్నత విద్యామండలి ఛైర్మన్‌ శ్రీ పాపిరెడ్డి ప్రారంభించారు. కరోనా కల్గించిన ఆర్ధిక కల్లోలంపై పోరాడి విజయం సాధించాలని ఆయన పిలుపునిచ్చారు. కరోనా సమయంలో ఖనిజ పరిశ్రమల మనుగడకు జాతీయ, అంతర్జాతీయ మైనింగ్‌ మేథావులతో ఈ వెబ్‌నార్‌ నిర్వహించడం ఎంతో ప్రశంసనీయమని మంచి ప్రతిపాదనలు వెల్లడవుతాయని ఆశిస్తున్నానన్నారు. సింగరేణి తరపున జీఎం(మార్కెటింగ్‌) కె.రవిశంకర్‌ మాట్లాడుతూ కరోనాతో దేశంలో సగానికి పై బొగ్గు వినియోగం తగ్గిపోయిందని, ఇదే సమయంలో విదేశీ బొగ్గు తక్కువ ధరకే అమ్మకానికి సిద్దంగా ఉంచారన్నారు. దీనివల్ల ప్రభుత్వ రంగ పరిశ్రమలు కొత్త సవాళ్లను ఎదుర్కోవాల్సి వస్తోందన్నారు. ఈ వెబినార్‌‌లో దేశ వ్యాప్తంగా ఉన్న ఇంజినీర్లు, ఆస్ట్రేలియా, స్వీడన్‌ దేశాల నుంచి మైనింగ్‌ మేథావులు తమ ఉపన్యాసాలు సమర్పించారు. డా.లక్ష్మీ చికటమర్ల, దిపేష్‌ దిపు, బిద్యుత్‌ చక్రబోర్తి, పి.కె.సటపతి, కె.రవిశంకర్‌, పి.శరత్‌ కుమార్‌, భవీష్‌ సంఘవి, డియాగో గలార్‌ తమ పేపర్లను సమర్పించారు. ప్రారంభ, ముగింపు సమావేశానికి ఐ.ఇ.ఐ. ఛైర్మన్‌ డాక్టర్‌ జి.రామేశ్వర్‌‌రావు అధ్యక్షత వహించారు.

Tags:    

Similar News