రోడ్డుపై గుంతలు పూడ్చిన డ్రైవర్లు

దిశ, వెబ్‌డెస్క్: రామన్నపేట-అమ్మనబోలు మధ్య రహదారి గుంతలమయంగా మారడంతో స్థానికులు మట్టిపోయించి పూడ్చారు. ఈ ఘటన యాదాద్రి భువనగిరి జిల్లా రామన్నపేట మండలం మునిపంపుల గ్రామంలో మంగళవారం చోటుచేసుకుంది. వివరాళ్లోకి వెళితే.. మునింపుల-దుబ్బాక గ్రామాల మధ్య రహదారి మొత్తం గుంతలు గుంతలుగా మారింది. దీంతో తరచూ అటునుంచి వెళ్లే వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అంతేగాకుండా వాటి మూలంగా ప్రమాదాలు చోటుచేసుకొని, ప్రాణాలు పోయే ప్రమాదం ఉండటంతో గమనించిన స్థానికులు పలుమార్లు ప్రజాప్రతినిధులకు సమాచారం అందించారు. అయినా.. […]

Update: 2021-03-16 06:13 GMT

దిశ, వెబ్‌డెస్క్: రామన్నపేట-అమ్మనబోలు మధ్య రహదారి గుంతలమయంగా మారడంతో స్థానికులు మట్టిపోయించి పూడ్చారు. ఈ ఘటన యాదాద్రి భువనగిరి జిల్లా రామన్నపేట మండలం మునిపంపుల గ్రామంలో మంగళవారం చోటుచేసుకుంది. వివరాళ్లోకి వెళితే.. మునింపుల-దుబ్బాక గ్రామాల మధ్య రహదారి మొత్తం గుంతలు గుంతలుగా మారింది. దీంతో తరచూ అటునుంచి వెళ్లే వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అంతేగాకుండా వాటి మూలంగా ప్రమాదాలు చోటుచేసుకొని, ప్రాణాలు పోయే ప్రమాదం ఉండటంతో గమనించిన స్థానికులు పలుమార్లు ప్రజాప్రతినిధులకు సమాచారం అందించారు. అయినా.. వారు పట్టించుకోకపోవడంతో స్వయంగా గ్రామంలోని ట్రాక్టర్ డ్రైవర్ మజ్జూరి సాలమయ్య, ఆటో డ్రైవర్ మేకల రాములు, విద్యార్థి బూడిద మధు కలిసి మట్టి పోయించి, దాదాపు పదిహేను గుంతలకుపైగా పూడ్చారు. దీంతో స్థానికులు వారిని అభినందించారు.

 

Tags:    

Similar News