ఆ కాలి ముద్రలు చిరుత పులి వేనా?
దిశ, మహబూబ్నగర్: తెలంగాణలో వరుసగా చిరుత పులుల సంచారం కలకలం రేపుతోంది. తాజాగా వనపర్తి జిల్లా వీపనగండ్ల మండలం కల్వరాల సమీపంలో గోపాలదీన్నే రిజర్వాయర్ వద్ద చిరుత ఆనవాళ్లు స్థానికుల్లో భయాందోళన కలిగిస్తుంది. శనివారం అర్ధరాత్రి చిరుత రెండు మేక పిల్లలను ఎత్తికెళ్లిన్నట్లు గ్రామస్తులు తెలిపారు. విషయం తెలుసుకున్న అటవీశాఖ అధికారులు, పోలీసులు గ్రామానికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. అక్కడ ఉన్న కాలిముద్రలు చిరుతవేనా కాదా అన్న విషయంపై ఆరా తీస్తున్నారు. గ్రామస్తులు ఎవ్వరూ కూడా సమీప […]
దిశ, మహబూబ్నగర్: తెలంగాణలో వరుసగా చిరుత పులుల సంచారం కలకలం రేపుతోంది. తాజాగా వనపర్తి జిల్లా వీపనగండ్ల మండలం కల్వరాల సమీపంలో గోపాలదీన్నే రిజర్వాయర్ వద్ద చిరుత ఆనవాళ్లు స్థానికుల్లో భయాందోళన కలిగిస్తుంది. శనివారం అర్ధరాత్రి చిరుత రెండు మేక పిల్లలను ఎత్తికెళ్లిన్నట్లు గ్రామస్తులు తెలిపారు. విషయం తెలుసుకున్న అటవీశాఖ అధికారులు, పోలీసులు గ్రామానికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. అక్కడ ఉన్న కాలిముద్రలు చిరుతవేనా కాదా అన్న విషయంపై ఆరా తీస్తున్నారు. గ్రామస్తులు ఎవ్వరూ కూడా సమీప అడవిలోకి వెళ్లరాదని సూచించారు.