రాజధాని తరలింపునకు ముహూర్తం ఫిక్స్.. వెల్లడించిన విజయసాయిరెడ్డి

దిశ, వెబ్‌డెస్క్: రాజధానిని అమరావతి నుంచి తరలించడంపై వైసీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి క్లారిటీ ఇచ్చారు. అతి త్వరలో విశాఖకు ఎగ్జిక్యూటివ్ రాజధాని వస్తుందని వ్యాఖ్యానించారు. సీఎం జగన్ ఎక్కడి నుంచైనా పరిపాలన సాగించవచ్చన్నారు. సీఆర్డీఏ కేసులకు, రాజధాని తరలింపునకు ఎటువంటి సంబంధం లేదని విజయసాయిరెడ్డి తెలిపారు. విజయసాయిరెడ్డి కామెంట్స్‌ని బట్టి చూస్తుంటే.. విశాఖకు రాజధానిని తరలిస్తారని, జగన్ మాత్రం తాడిపత్రి నుంచే పరిపాలన సాగిస్తారనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. రాజధానిని ఎప్పుడో తరలించాల్సి […]

Update: 2021-06-02 05:08 GMT

దిశ, వెబ్‌డెస్క్: రాజధానిని అమరావతి నుంచి తరలించడంపై వైసీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి క్లారిటీ ఇచ్చారు. అతి త్వరలో విశాఖకు ఎగ్జిక్యూటివ్ రాజధాని వస్తుందని వ్యాఖ్యానించారు. సీఎం జగన్ ఎక్కడి నుంచైనా పరిపాలన సాగించవచ్చన్నారు. సీఆర్డీఏ కేసులకు, రాజధాని తరలింపునకు ఎటువంటి సంబంధం లేదని విజయసాయిరెడ్డి తెలిపారు.

విజయసాయిరెడ్డి కామెంట్స్‌ని బట్టి చూస్తుంటే.. విశాఖకు రాజధానిని తరలిస్తారని, జగన్ మాత్రం తాడిపత్రి నుంచే పరిపాలన సాగిస్తారనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. రాజధానిని ఎప్పుడో తరలించాల్సి ఉండగా.. కరోనా రావడం, హైకోర్టులో కేసులు పెండింగ్‌లో ఉండటంతో ప్రక్రియ ఆగిపోయింది. ప్రస్తుతం సెకండ్ వేవ్ ప్రభావం తగ్గుతుండటం, జగన్ పాలనకు రెండేళ్లు పూర్తయిన క్రమంలో త్వరలో రాజధానిని తరలించేందుకు ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది.

Tags:    

Similar News