మాజీ కేంద్రమంత్రిపై మోడీకి ఫిర్యాదు
దిశ, ఏపీ బ్యూరో: 2017లో విజయనగరం జిల్లాలో జరిగిన రైలు ప్రమాదంపై అత్యున్నతస్థాయి విచారణ జరిపించాలని డిమాండ్ చేస్తూ వైసీపీ పార్లమెంటరీ నేత విజయసాయిరెడ్డి ప్రధాని నరేంద్ర మోడీకి లేఖ రాశారు. కేంద్ర మాజీ మంత్రి, మాన్సాస్ ట్రస్ట్ చైర్మన్ అశోక్ గజపతిరాజుపై లేఖలో అనేక ఆరోపణలు చేశారు. 2017లో జనవరి 21న జగదల్ పూర్ నుంచి భువనేశ్వర్ వెళుతున్న హీరాఖండ్ ఎక్స్ ప్రెస్ కొమరాడ మండలం కూనేరు వద్ద పట్టాలు తప్పింది. ఈ ప్రమాదంలో 42 […]
దిశ, ఏపీ బ్యూరో: 2017లో విజయనగరం జిల్లాలో జరిగిన రైలు ప్రమాదంపై అత్యున్నతస్థాయి విచారణ జరిపించాలని డిమాండ్ చేస్తూ వైసీపీ పార్లమెంటరీ నేత విజయసాయిరెడ్డి ప్రధాని నరేంద్ర మోడీకి లేఖ రాశారు. కేంద్ర మాజీ మంత్రి, మాన్సాస్ ట్రస్ట్ చైర్మన్ అశోక్ గజపతిరాజుపై లేఖలో అనేక ఆరోపణలు చేశారు. 2017లో జనవరి 21న జగదల్ పూర్ నుంచి భువనేశ్వర్ వెళుతున్న హీరాఖండ్ ఎక్స్ ప్రెస్ కొమరాడ మండలం కూనేరు వద్ద పట్టాలు తప్పింది. ఈ ప్రమాదంలో 42 మంది ప్రయాణికులు ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటనపై విచారణ సక్రమంగా జరగకుండా నాటి కేంద్రమంత్రి అశోక్ గజపతిరాజు ప్రభావితం చేశారని లేఖలో ఆరోపించారు. ఈ నేపథ్యంలో కేంద్ర మాజీ మంత్రి అశోక్ గజపతిరాజుపై అత్యున్నత విచారణ జరిపించాలని ప్రధానమంత్రి మోడీకి లేఖ రాసినట్లు విజయసాయి రెడ్డి ట్విటర్ వేదికగా తెలిపారు.