తల్లికి విజయ్ బర్త్‌డే విషెస్..

దిశ, వెబ్‌డెస్క్: రౌడీ హీరో విజయ్ దేవరకొండ రఫ్‌గా కనిపించినా.. ఫ్యామిలీ, ఫ్రెండ్స్ విషయానికి వచ్చేసరికి మాత్రం చాలా ఎమోషనల్ బాండింగ్ ఉంటుంది. తను హీరో కాక ముందు అమ్మానాన్న పడిన కష్టాలు.. తమ్ముడు ఆనంద్ దేవరకొండ జాబ్ చేస్తూ తనకు సపోర్ట్ చేసిన విషయం ఇంతకుముందే చెప్పిన విజయ్.. వాళ్ల త్యాగం ముందు తనెంత అని.. తన లైఫ్‌లో వారికే ఫస్ట్ ప్రిఫరెన్స్ ఉంటుందని కూడా చెప్పాడు. ఈ మధ్యతరగతి కష్టాలు, ప్రేమలు తెలిసే లాక్‌డౌన్‌లో […]

Update: 2020-09-24 05:09 GMT

దిశ, వెబ్‌డెస్క్: రౌడీ హీరో విజయ్ దేవరకొండ రఫ్‌గా కనిపించినా.. ఫ్యామిలీ, ఫ్రెండ్స్ విషయానికి వచ్చేసరికి మాత్రం చాలా ఎమోషనల్ బాండింగ్ ఉంటుంది. తను హీరో కాక ముందు అమ్మానాన్న పడిన కష్టాలు.. తమ్ముడు ఆనంద్ దేవరకొండ జాబ్ చేస్తూ తనకు సపోర్ట్ చేసిన విషయం ఇంతకుముందే చెప్పిన విజయ్.. వాళ్ల త్యాగం ముందు తనెంత అని.. తన లైఫ్‌లో వారికే ఫస్ట్ ప్రిఫరెన్స్ ఉంటుందని కూడా చెప్పాడు. ఈ మధ్యతరగతి కష్టాలు, ప్రేమలు తెలిసే లాక్‌డౌన్‌లో మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్‌కు హెల్ప్ చేశాడు కూడా.

https://www.instagram.com/p/CFg8Yl6B9lm/?utm_source=ig_web_copy_link

ముఖ్యంగా తల్లి విషయంలో చాలా కేర్‌ఫుల్‌గా ఉండే విజయ్.. తన పుట్టినరోజును పురస్కరించుకుని స్పెషల్ వీడియో పోస్ట్ చేశాడు. 50వ జన్మదినం జరుపుకుంటున్న విజయ్ తల్లి హాఫ్ సెంచరీ కంప్లీట్ చేయగా.. క్రికెటర్ స్టైల్‌లో బ్యాట్ ఎత్తి చూపుతూ సూపర్ స్మైల్ ఇచ్చింది. విజయ్, ఆనంద్‌లతో కలిసి ఉన్న ఈ వీడియో చూసేందుకు చాలా ఆనందంగా కనిపిస్తుండగా.. ‘హ్యాపీ బర్త్ డే అమ్మ.. నాకు తెలుసు నువ్వు ఎప్పటికీ సంతోషంగా ఉంటావని’ అంటూ స్పెషల్ విషెస్ అందించాడు విజయ్.

కాగా, పూరీ జగన్నాధ్ దర్శకత్వంలో వస్తున్న ‘ఫైటర్’ సినిమా ద్వారా బాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్న విజయ్.. ఈ పాన్ ఇండియా మూవీని కంప్లీట్ చేయాల్సి ఉంది. కరోనా కారణంగా వాయిదా పడిన షూటింగ్ త్వరలో రీస్టార్ట్ కానుంది.

Tags:    

Similar News