శివన్.. నయన్‌కు హ్యాండ్ ఇచ్చినట్టేనా?

దిశ, వెబ్‌డెస్క్: లేడీ సూపర్ స్టార్ నయనతార, డైరెక్టర్ విఘ్నేష్ శివన్‌ల ప్రేమ, పెళ్లి విషయాలు కోలీవుడ్‌లో ఎప్పుడూ హాట్ టాపికే. శింబు, ప్రభుదేవాతో ప్రేమాయణం తర్వాత విఘ్నేష్‌తో లవ్‌లో పడ్డ నయన్.. మాజీ లవర్స్‌తో పీటల వరకు వెళ్లిన పెళ్లి ఆగిపోయేందుకు కారణం నమ్మకం లేకపోవడమే అని గతంలో చెప్పింది. కాగా ఇప్పుడు నయన్, విఘ్నేష్‌ల పెళ్లి రేపు, మాపు అంటూ మీడియా ప్రచారం చేస్తున్న వేళ.. దీనిపై క్లారిటీనిచ్చాడు విఘ్నేష్. మీడియా ఇప్పటికే 22 […]

Update: 2020-08-26 00:37 GMT

దిశ, వెబ్‌డెస్క్:
లేడీ సూపర్ స్టార్ నయనతార, డైరెక్టర్ విఘ్నేష్ శివన్‌ల ప్రేమ, పెళ్లి విషయాలు కోలీవుడ్‌లో ఎప్పుడూ హాట్ టాపికే. శింబు, ప్రభుదేవాతో ప్రేమాయణం తర్వాత విఘ్నేష్‌తో లవ్‌లో పడ్డ నయన్.. మాజీ లవర్స్‌తో పీటల వరకు వెళ్లిన పెళ్లి ఆగిపోయేందుకు కారణం నమ్మకం లేకపోవడమే అని గతంలో చెప్పింది. కాగా ఇప్పుడు నయన్, విఘ్నేష్‌ల పెళ్లి రేపు, మాపు అంటూ మీడియా ప్రచారం చేస్తున్న వేళ.. దీనిపై క్లారిటీనిచ్చాడు విఘ్నేష్. మీడియా ఇప్పటికే 22 సార్లు మా పెళ్లి చేసిందని, కానీ ఇప్పట్లో తమ వివాహం జరగదని స్పష్టం చేశాడు. ప్రస్తుతానికి ఇద్దరం డేటింగ్‌ను ఎంజాయ్ చేస్తున్నామని, డేట్ బోర్ కొట్టినప్పుడు మ్యారేజ్ గురించి ఆలోచిస్తామని చెప్పాడు. ‘కెరియర్ పరంగా ఇద్దరం సాధించాల్సింది చాలా ఉంది.. ఆ తర్వాతే పెళ్లి’ అని తెలిపాడు. విజయ్ సేతుపతి, నయన్, సమంత ప్రధాన పాత్రల్లో వస్తున్న సినిమాను డైరెక్ట్ చేయబోతున్న శివన్.. త్వరలో ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లనుందని చెప్పాడు.

దీంతో నయన్, శివన్ పెళ్లి ఇప్పట్లో జరగడం కష్టమని స్పష్టం అవుతుండగా.. శివన్ మాటలు చూస్తుంటే అసలు నయన్‌ను పెళ్లి చేసుకుంటాడా? లేదా అని ఆందోళన చెందుతున్నారు నయన్ ఫ్యాన్స్. రెండుసార్లు మోసపోయిన ఈ లేడీ సూపర్ స్టార్ మరోసారి మోసపోతుందేమో అని బాధపడుతున్నారు.

Tags:    

Similar News