ఆ వీడియోలు అవాస్తవం

దిశ, హైదరాబాద్: ఉస్మానియా ఆసుపత్రి మార్చురీలో మృతదేహాల పరిరక్షణ, దహన సంస్కారాలపై సోషల్ మీడియాలో వైరల్ అయిన వీడియోలు అవాస్తమని ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ నాగేందర్ అన్నారు. ఈ మేరకు గురువారం ఆయన ఓ ప్రకటన విడుదల చేశారు. మార్చురీలోని మృతదేహాలను ఎలాంటి అనుమతి లేకుండానే చిత్రీకరించి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడం ఆసుపత్రి ప్రతిష్టను దిగజార్చడమేనని అన్నారు. సామాన్య ప్రజానీకానికి, ఉస్మానియాకు వస్తున్న రోగులను భయాందోళనకు గురిచేసేలా వ్యవహరిస్తున్నారని నాగేందర్ పేర్కొన్నారు. అనుమతి లేకుండా వీడియోలు […]

Update: 2020-06-25 11:08 GMT

దిశ, హైదరాబాద్: ఉస్మానియా ఆసుపత్రి మార్చురీలో మృతదేహాల పరిరక్షణ, దహన సంస్కారాలపై సోషల్ మీడియాలో వైరల్ అయిన వీడియోలు అవాస్తమని ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ నాగేందర్ అన్నారు. ఈ మేరకు గురువారం ఆయన ఓ ప్రకటన విడుదల చేశారు. మార్చురీలోని మృతదేహాలను ఎలాంటి అనుమతి లేకుండానే చిత్రీకరించి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడం ఆసుపత్రి ప్రతిష్టను దిగజార్చడమేనని అన్నారు. సామాన్య ప్రజానీకానికి, ఉస్మానియాకు వస్తున్న రోగులను భయాందోళనకు గురిచేసేలా వ్యవహరిస్తున్నారని నాగేందర్ పేర్కొన్నారు.

అనుమతి లేకుండా వీడియోలు పోస్ట్ చేస్తున్న వారిపైన చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. మార్చురీలో సాధారణంగా ఆసుపత్రిలో మృతిచెందిన వారితో పాటు హైదరాబాద్ చుట్టు పక్కల ప్రాంతాల నుంచి నిత్యం గుర్తు తెలియని మృతదేహాలు వస్తుంటాయన్నారు. మృతదేహాలను సుమారు 10 నుంచి 15 రోజులలోపు గుర్తించి బంధువులకు అప్పగిస్తామని తెలిపారు. ఆచూకీ తెలియని వాటిని జీహెచ్ఎంసీకి అప్పగించి ఖననం చేస్తారని వెల్లడించారు. ఇలాంటి వీడియోలను నమ్మెద్దని డాక్టర్ నాగేందర్ ప్రజలకు సూచించారు.

Tags:    

Similar News