కత్రినాతో డేటింగ్‌పై విక్కీ కామెంట్స్

బాలీవుడ్‌లో ప్రేమాయణం కామన్. ఒకరిని వదిలి మరొకరితో చెట్టాపట్టాలేసుకుని తిరగడం చాలా సాధారణం. చాలామంది స్టార్స్ ఇలా రిలేషన్ షిప్‌లో ఉండి విడిపోయి తర్వాత వేరే వారిని పెళ్లి చేసుకుని సెటిల్ అయితే… కొందరు ప్రేమించిన వారినే పెళ్లాడారు. అయితే ఈ మధ్య నేషనల్ అవార్డు విన్నర్ విక్కీ కౌశల్, బాలీవుడ్ బ్యూటీ కత్రినా కైఫ్‌ల మధ్య సంథింగ్ సంథింగ్ ఉందంటూ గుసగుసలు వినిపిస్తున్నాయి. మీడియాలో, పత్రికల్లో వీరి మధ్య బంధంపై చాలా ప్రచారం జరిగింది. ఈ […]

Update: 2020-02-18 05:14 GMT

బాలీవుడ్‌లో ప్రేమాయణం కామన్. ఒకరిని వదిలి మరొకరితో చెట్టాపట్టాలేసుకుని తిరగడం చాలా సాధారణం. చాలామంది స్టార్స్ ఇలా రిలేషన్ షిప్‌లో ఉండి విడిపోయి తర్వాత వేరే వారిని పెళ్లి చేసుకుని సెటిల్ అయితే… కొందరు ప్రేమించిన వారినే పెళ్లాడారు. అయితే ఈ మధ్య నేషనల్ అవార్డు విన్నర్ విక్కీ కౌశల్, బాలీవుడ్ బ్యూటీ కత్రినా కైఫ్‌ల మధ్య సంథింగ్ సంథింగ్ ఉందంటూ గుసగుసలు వినిపిస్తున్నాయి. మీడియాలో, పత్రికల్లో వీరి మధ్య బంధంపై చాలా ప్రచారం జరిగింది.

ఈ విషయాన్నే విక్కీ కౌశల్ దగ్గర ప్రస్తావిస్తే.. సమాధానం చెప్పకుండా చక్కగా తప్పించుకున్నారు. కత్రినాతో డేటింగ్‌లో ఉన్నారా? అనే ప్రశ్నకు చాలా తెలివిగా ఆన్సర్ ఇచ్చారు విక్కీ. నా పర్సనల్ లైఫ్‌ను చాలా రహస్యంగా ఉంచాలని అనుకుంటున్నాను అని చెప్పారు. ఈ విషయంలో నేను ఓపెన్ అప్ అయిపోతే… లేని పోని తలనొప్పి ఉంటుందన్నారు. కొందరు తప్పుగా అనుకుంటే… మరికొందరు దీనిపై చర్చలే మొదలెట్టేస్తారన్నారు. అందుకే ఈ విషయాన్ని ఇంతటితో వదిలేయాలన్న విధంగా ఆన్సర్ ఇచ్చారు విక్కీ.

Tags:    

Similar News