కెప్టెన్ అంటే ఎప్పుడు బ్యాటర్లేనా.. బౌలర్లు పనికిరారా? : ఆశిశ్ నెహ్రా హాట్ కామెంట్స్

దిశ, వెబ్‌డెస్క్ : టీ20 కెప్టెన్‌గా విరాట్ కోహ్లీ శకం ముగియడంతో నవంబర్ 17 నుంచి టీం ఇండియా హెడ్ కోచ్ రాహుల్ ద్రావిడ్ సారథ్యంలో జట్టును నడిపించే కొత్త కెప్టెన్ ఎవరనే విషయంపై ఇంకా క్లారిటీ రాలేదు. అయితే, చాలా మంది దిగ్గజాలు, క్రికెట్ అభిమానులు కేఎల్ రాహుల్, రోహిత్​శర్మ పేర్లను సూచిస్తున్నారు. మరికొంత మంది మాత్రం టీమిండియా భవిష్యత్తు దృష్ట్యా రిషబ్ పంత్‌కు అవకాశమిస్తే బాగుంటుందని అభిప్రాయపడుతున్నారు. ఈ నేపథ్యంలో టీమిండియా మాజీ పేసర్ […]

Update: 2021-11-08 11:09 GMT

దిశ, వెబ్‌డెస్క్ : టీ20 కెప్టెన్‌గా విరాట్ కోహ్లీ శకం ముగియడంతో నవంబర్ 17 నుంచి టీం ఇండియా హెడ్ కోచ్ రాహుల్ ద్రావిడ్ సారథ్యంలో జట్టును నడిపించే కొత్త కెప్టెన్ ఎవరనే విషయంపై ఇంకా క్లారిటీ రాలేదు. అయితే, చాలా మంది దిగ్గజాలు, క్రికెట్ అభిమానులు కేఎల్ రాహుల్, రోహిత్​శర్మ పేర్లను సూచిస్తున్నారు. మరికొంత మంది మాత్రం టీమిండియా భవిష్యత్తు దృష్ట్యా రిషబ్ పంత్‌కు అవకాశమిస్తే బాగుంటుందని అభిప్రాయపడుతున్నారు.

ఈ నేపథ్యంలో టీమిండియా మాజీ పేసర్ ఆశిష్ నెహ్రా కీలక వ్యాఖ్యలు చేశాడు. టీమిండియా కెప్టెన్సీ బాధ్యతలు చేపట్టేందుకు బౌలర్లు పనికి రారా..? అని మాజీ పేసర్ ఆశిష్ నెహ్రా ప్రశ్నించాడు. భారత జట్టుకు బౌలర్లను కెప్టెన్‌గా ఎంచుకోవద్దని బీసీసీఐ రాజ్యంగంలో ఏం రాసిలేదు కదా..? అని ప్రశ్నించాడు. టీమిండియా యార్కర్ల కింగ్ జస్‌ప్రీత్ బుమ్రాకు సారథ్యం వహించే సామర్థ్యం ఉందని ఈ మాజీ పేసర్ అభిప్రాయపడ్డాడు. రోహిత్ శర్మ తర్వాత కెప్టెన్ రేసులో నిలిచిన కేఎల్ రాహుల్, రిషభ్ పంత్ కన్నా బుమ్రాను కెప్టెన్ చేయడమే ఉత్తమమన్నాడు. అతను మూడు ఫార్మాట్లు ఆడుతున్న ప్లేయరని, రాహుల్, రిషభ్ పంత్ పరిమిత ఓవర్ల సిరీస్‌ల్లోనే ఆడుతున్నారని గుర్తు చేశాడు.

మరో వారం తర్వాత BCCI T20 జట్టుకు కొత్త కెప్టెన్​ఎవరనే దానిపై స్పష్టత ఇవ్వనుంది. త్వరలోనే న్యూజిలాండ్‌తో 3 టీ20లు, రెండు టెస్టు మ్యాచులు ఆడనుంది భారత జట్టు. ఈ సిరీస్‌లో బరిలోకి దిగే జట్ల వివరాలను కూడా త్వరలో వెల్లడించనున్నారు.

Tags:    

Similar News