తెవాతియాకు థ్యాంక్స్: యువరాజ్‌సింగ్
దిశ, స్పోర్ట్స్: ఆ ఒక్క బంతి వదిలివేసినందుకు రాహుల్ తెవాతియాకు వెటర్నర్ క్రికెటర్ యువరాజ్‌సింగ్ థ్యాంక్స్ చెప్పారు. పంజాబ్ ఆటగాడు కోట్రెల్ బౌలింగ్‌లో తెవాతియా ఆరు బంతుల్లో ఐదు సిక్స్‌లు కొట్టిన విషయం విధితమే. మరో సిక్స్ కొట్టనందుకు అతనికి కృతజ్ఞతలు అని యువరాజ్ పేర్కొన్నాడు. ఆరు బంతుల్లో ఆరు సిక్స్‌లు బాదిన రికార్డు యువరాజ్‌సింగ్ పేరిట ఉంది. ఈ రికార్డు బ్రేక్ చేయనందుకే తెవాతియాకు అతను థ్యాంక్స్ చెప్పాడు. ఆదివారం కింగ్స్ ఎలెవన్ పంజాబ్‌తో మ్యాచ్‌లో […]
దిశ, స్పోర్ట్స్: ఆ ఒక్క బంతి వదిలివేసినందుకు రాహుల్ తెవాతియాకు వెటర్నర్ క్రికెటర్ యువరాజ్‌సింగ్ థ్యాంక్స్ చెప్పారు. పంజాబ్ ఆటగాడు కోట్రెల్ బౌలింగ్‌లో తెవాతియా ఆరు బంతుల్లో ఐదు సిక్స్‌లు కొట్టిన విషయం విధితమే. మరో సిక్స్ కొట్టనందుకు అతనికి కృతజ్ఞతలు అని యువరాజ్ పేర్కొన్నాడు. ఆరు బంతుల్లో ఆరు సిక్స్‌లు బాదిన రికార్డు యువరాజ్‌సింగ్ పేరిట ఉంది.
ఈ రికార్డు బ్రేక్ చేయనందుకే తెవాతియాకు అతను థ్యాంక్స్ చెప్పాడు. ఆదివారం కింగ్స్ ఎలెవన్ పంజాబ్‌తో మ్యాచ్‌లో రాజస్థాన్ రాయల్స్ ఆటగాడు తెవాతియా వీరవిహారం చేశాడు. రాజస్థాన్ గెలుపులో కీలక భూమిక పోషించాడు. కోట్రెల్ వేసిన 18వ ఓవర్ రన్నింగ్‌లో తొలి నాలుగు బంతులను సిక్స్‌లుగా మల్చాడు. ఐదో బంతికి పరుగు రాలేదు. ఆరో బంతికి సిక్స్ బాదాడు. ఒకే ఓవర్‌లో 30 పరుగులు రావడంతో మ్యాచ్ మలుపు తిరిగింది. అప్పటివరకు ఓడిపోతామనుకున్న మ్యాచ్‌లో రాజస్థాన్ గెలుపు సాధించింది.