'అలయ్ బలయ్' కార్యక్రమంపై వెంకయ్య ప్రశంసలు

దిశ, తెలంగాణ బ్యూరో: ‘అలయ్ బలయ్’ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు హాజరయ్యారు. ఈ సందర్భంగా వెంకయ్య మాట్లాడుతూ.. విపత్కర పరిస్థితుల నుంచి ఇప్పుడే బయట పడుతున్నామని, ఇంకా పూర్తి స్థాయిలో బయటపడలేదన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సూచిస్తున్న జాగ్రత్తలు పాటించాలని, అందరూ ఆరోగ్యంగా ఉండాలన్నారు.  17వ అలయ్ బలయ్‌ని కూడా సంస్కృతి సంప్రదాయాలు ఉట్టిపడేలా నిర్వహించడం గర్వకారణమన్నారు. రాష్ట్రం విడిపోయిన తర్వాత కూడా ప్రతి ఇంట్లో బతుకమ్మ ఉత్సవాలు నిర్వహించడం గర్వకారణమని, భవిష్యత్ […]

Update: 2021-10-17 02:33 GMT

దిశ, తెలంగాణ బ్యూరో: ‘అలయ్ బలయ్’ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు హాజరయ్యారు. ఈ సందర్భంగా వెంకయ్య మాట్లాడుతూ.. విపత్కర పరిస్థితుల నుంచి ఇప్పుడే బయట పడుతున్నామని, ఇంకా పూర్తి స్థాయిలో బయటపడలేదన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సూచిస్తున్న జాగ్రత్తలు పాటించాలని, అందరూ ఆరోగ్యంగా ఉండాలన్నారు. 17వ అలయ్ బలయ్‌ని కూడా సంస్కృతి సంప్రదాయాలు ఉట్టిపడేలా నిర్వహించడం గర్వకారణమన్నారు.

రాష్ట్రం విడిపోయిన తర్వాత కూడా ప్రతి ఇంట్లో బతుకమ్మ ఉత్సవాలు నిర్వహించడం గర్వకారణమని, భవిష్యత్ లోనూ ఇది ఇలాగే కొనసాగాలని వెంకయ్య చెప్పారు. భారతీయుడిగా, తెలుగువారిగా మన సంస్కృతి సంప్రదాయాలను కాపాడుకోవాలని, కులమతాలకు అతీతంగా ఉన్నతమైన జీవనాన్ని కొనసాగించాలన్నారు.

పలువురు ప్రముఖులు హాజరు

గవర్నర్ తమిళి సై, సినీ నటుడు పవన్ కళ్యాణ్, ‘మా’ అసోసియేషన్ అధ్యక్షుడు మంచు విష్ణు , మాజీ ఎంపీ బూర నర్సయ్య గౌడ్, వైసీపీ నాయకురాలు లక్ష్మీ పార్వతితో పాటు పలువురు ప్రముఖులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు.

Tags:    

Similar News