జర్నలిస్టు ముసుగులో తిరుమలకు మద్యం, మాంసం
గతంలో జర్నలిస్టుగా పనిచేసిన వ్యక్తి ఇప్పటికీ మీడియాలోనే పనిచేస్తున్నానని చెప్పుకుంటూ ఏకంగా పుణ్యక్షేత్రంలోనే అపచారానికి ఒడిగట్టాడు. అక్కడ మాంసం, మద్యం నిషేధమని తెలిసి కూడా అక్రమానికి పాల్పడి పోలీసులకు పట్టుబడ్డాడు. ఈ ఘటన తిరుమలలో చోటుచేసుకుంది. పూర్తి వివరాల్లోకి వెళ్తే… నిందితుడు వెంకటముని గతంలో ఒక మీడియా సంస్థలో పని చేశాడు. ఇప్పటికీ అదే సంస్థలో పని చేస్తున్నానని చెప్పుకుంటూ ఓ వాహనంలోని సీట్ కింది భాగంలో మద్యం, మాంసం ఉంచి తిరుపతి నుంచి తిరుమలకు బయల్దేరాడు. […]
గతంలో జర్నలిస్టుగా పనిచేసిన వ్యక్తి ఇప్పటికీ మీడియాలోనే పనిచేస్తున్నానని చెప్పుకుంటూ ఏకంగా పుణ్యక్షేత్రంలోనే అపచారానికి ఒడిగట్టాడు. అక్కడ మాంసం, మద్యం నిషేధమని తెలిసి కూడా అక్రమానికి పాల్పడి పోలీసులకు పట్టుబడ్డాడు. ఈ ఘటన తిరుమలలో చోటుచేసుకుంది. పూర్తి వివరాల్లోకి వెళ్తే… నిందితుడు వెంకటముని గతంలో ఒక మీడియా సంస్థలో పని చేశాడు. ఇప్పటికీ అదే సంస్థలో పని చేస్తున్నానని చెప్పుకుంటూ ఓ వాహనంలోని సీట్ కింది భాగంలో మద్యం, మాంసం ఉంచి తిరుపతి నుంచి తిరుమలకు బయల్దేరాడు. పోలీసులకు అతనిపై అనుమానం రావడంతో సోదాలు నిర్వహించగా అతడు మద్యం, మాంసం తరలిస్తున్నాడని నిర్ధారణ అయింది. దీంతో విజిలెన్స్ పోలీసులు అతడిని అదుపులోకి తీసుకున్నారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.