‘సమస్యల పరిష్కార బాధ్యత అధికారులదే’

          అవినీతిని నిర్మూలించి ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేయాల్సిన బాధ్యత సివిల్ సర్వీసెస్ అధికారులదేనని ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు అన్నారు. హైదరాబాద్‌లోని ఎంసీహెచ్‌ఆర్డీలో అఖిల భారత సర్వీసులు-సివిల్‌సర్వీసులు, మిలిటరీ ఇంజనీరింగ్‌ సర్వీసు అధికారుల ఫౌండేషన్‌ కోర్సు సందర్భంగా వారినుద్దేశించి వెంకయ్యనాయుడు మాట్లాడారు. సివిల్ సర్వెంట్స్ నిజాయతీతో పనిచేయాలన్నారు. ప్రజాసేవే పరమావధిగా భావించాలని ఆయన సూచించారు. పేదరికం, నిరక్షరాస్యత, కుల, మత లింగ వివక్షలను పారదోలడంతోపాటు గ్రామీణ ప్రాంతాల్లో మౌలిక వసతుల కల్పనకు […]

Update: 2020-02-07 09:59 GMT

అవినీతిని నిర్మూలించి ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేయాల్సిన బాధ్యత సివిల్ సర్వీసెస్ అధికారులదేనని ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు అన్నారు. హైదరాబాద్‌లోని ఎంసీహెచ్‌ఆర్డీలో అఖిల భారత సర్వీసులు-సివిల్‌సర్వీసులు, మిలిటరీ ఇంజనీరింగ్‌ సర్వీసు అధికారుల ఫౌండేషన్‌ కోర్సు సందర్భంగా వారినుద్దేశించి వెంకయ్యనాయుడు మాట్లాడారు. సివిల్ సర్వెంట్స్ నిజాయతీతో పనిచేయాలన్నారు. ప్రజాసేవే పరమావధిగా భావించాలని ఆయన సూచించారు. పేదరికం, నిరక్షరాస్యత, కుల, మత లింగ వివక్షలను పారదోలడంతోపాటు గ్రామీణ ప్రాంతాల్లో మౌలిక వసతుల కల్పనకు కృషి చేయాలని కోరారు.

Tags:    

Similar News