బోనమెత్తిన వేములవాడ..

దిశ, వేములవాడ : వేములవాడ రాజన్న సన్నిధి సమీపంలోని బద్ది పోచమ్మ ఆలయం బోనాలతో రద్దీగా మారిపోయింది. కోరిన కోర్కెలు తీర్చే బద్ది పోచమ్మ అమ్మవారికి మహిళలు భక్తి శ్రద్ధలతో బోనాలు సమర్పించుకున్నారు. సోమవారం పార్వతీ రాజరాజేశ్వర స్వామి వారిని దర్శించుకున్న భక్తులు మంగళవారం బద్ది పోచమ్మకు నైవేధ్యం వండి, డప్పు చప్పుళ్ళతో ఊరేగింపుగా వెళ్లి అమ్మవారికి బోనాలు సమర్పించడం ఆనవాయితీగా వస్తుంది. కరోనా సెకండ్ వేవ్ వలన ఇన్ని రోజులు వేములవాడ ఆలయం మూసివేసిన విషయం […]

Update: 2021-07-06 03:59 GMT

దిశ, వేములవాడ : వేములవాడ రాజన్న సన్నిధి సమీపంలోని బద్ది పోచమ్మ ఆలయం బోనాలతో రద్దీగా మారిపోయింది. కోరిన కోర్కెలు తీర్చే బద్ది పోచమ్మ అమ్మవారికి మహిళలు భక్తి శ్రద్ధలతో బోనాలు సమర్పించుకున్నారు. సోమవారం పార్వతీ రాజరాజేశ్వర స్వామి వారిని దర్శించుకున్న భక్తులు మంగళవారం బద్ది పోచమ్మకు నైవేధ్యం వండి, డప్పు చప్పుళ్ళతో ఊరేగింపుగా వెళ్లి అమ్మవారికి బోనాలు సమర్పించడం ఆనవాయితీగా వస్తుంది.

కరోనా సెకండ్ వేవ్ వలన ఇన్ని రోజులు వేములవాడ ఆలయం మూసివేసిన విషయం తెలిసిందే. రాష్ట్రంలో కొవిడ్ తగ్గముఖం పట్టడంతో కొత్తగా పెళ్లైన జంటలతో పాటు భక్తులు రాజన్న దర్శనానికి క్యూ కట్టారు. మహిళలు భారీగా బోనమెత్తడంతో బద్ది పోచమ్మ ఆలయానికి వెళ్లే రహదారుల్లో జనసందోహం నెలకొంది.

Tags:    

Similar News