Tirumala Updates: తిరుమలలో తగ్గిన భక్తుల రద్దీ.. శ్రీవారి దర్శనానికి 8 గంటల సమయం

ఆపద మొక్కుల వాడు శ్రీ వేంకటేశ్వరుడి దివ్య సన్నిధి తిరుమల (Tirumala)లో భక్తుల రద్దీ పెరిగింది.

Update: 2024-11-18 03:32 GMT

దిశ, వెబ్‌డెస్క్: ఆపద మొక్కుల వాడు శ్రీ వేంకటేశ్వరుడి దివ్య సన్నిధి తిరుమల (Tirumala)లో భక్తుల రద్దీ తగ్గింది. ఆదివారం సెలవు దినం కావడంతో స్వామి వారిని దర్శించుకునేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. ఈ మేరకు టోకెన్లు లేని భక్తుల దర్శనానికి దాదాపు 8 గంటలకు పైగా సమయం పడుతోంది. ఇక రూ.300 ప్రత్యేక దర్శనానికి (Special Darshan) 2 నుంచి 3 గంటల సమయం పడుతోంది.

అదేవిధంగా సోమవారం వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌ (Vaikuntam Que Complex)లోని 3 కంపార్ట్‌మెంట్లలో భక్తులు దర్శనం కోసం వేచి చూస్తున్నారు. ఆదివారం స్వామి వారిని 71,441 మంది భక్తులు దర్శించుకున్నారు. అందులో 23,595 మంది భక్తులు తమ తలనీలాలు సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు. తిరుమల శ్రీవారి హుండీ (Srivari Hundi) ఆదాయం రూ.3.87 కోట్లు వచ్చిందని టీటీడీ అధికారులు (TTD Offcials) తెలిపారు. 

Tags:    

Similar News