ఫోన్ కొట్టు.. సరుకులు పట్టు
దిశ, మహబూబ్‌నగర్: నోవెల్ కరోనా వైరస్ (కొవిడ్ 19) కట్టడికి విధించిన లాక్‌డౌన్ వల్ల ప్రజలు ఇబ్బందులు ఎదుర్కోకుండా టెలీ విధానాన్ని మహబూబ్‌నగర్ జిల్లాలో అమలు చేస్తున్నారు. ఇందులో భాగంగా ప్రజాసమస్యల పరిష్కారం కోసం కమాండ్ కంట్రోల్ రూం పని చేస్తోంది. వైద్య సేవల కోసం టెలీ మెడిసిన్ కార్యక్రమాన్ని చేపడుతున్నారు. టెలీ బుకింగ్ ప్లాట్‌ఫాం.. పండ్లు, కూరగాయలు, కిరాణం సామగ్రి, శానిటైజర్, మాస్కులను అందించే ఈ సేవలను ఎం 3 ఫ్రెష్ పేరుతో జిల్లాలో అందుబాటులోకి […]
దిశ, మహబూబ్‌నగర్: నోవెల్ కరోనా వైరస్ (కొవిడ్ 19) కట్టడికి విధించిన లాక్‌డౌన్ వల్ల ప్రజలు ఇబ్బందులు ఎదుర్కోకుండా టెలీ విధానాన్ని మహబూబ్‌నగర్ జిల్లాలో అమలు చేస్తున్నారు. ఇందులో భాగంగా ప్రజాసమస్యల పరిష్కారం కోసం కమాండ్ కంట్రోల్ రూం పని చేస్తోంది. వైద్య సేవల కోసం టెలీ మెడిసిన్ కార్యక్రమాన్ని చేపడుతున్నారు.
టెలీ బుకింగ్ ప్లాట్‌ఫాం..
పండ్లు, కూరగాయలు, కిరాణం సామగ్రి, శానిటైజర్, మాస్కులను అందించే ఈ సేవలను ఎం 3 ఫ్రెష్ పేరుతో జిల్లాలో అందుబాటులోకి తెచ్చారు. మెప్మా, ఎంసీఆర్‌హెచ్, ఆర్‌డీఐ ఆధ్వర్యంలో ఈ సేవలను ప్రారంభించారు. రోజూ ఉదయం 6 నుంచి 11 గంటల వరకు 08542-252203 లేదా 9553050607 నెంబర్లకు ఫోన్లు చేస్తే ప్రజలకు కావాల్సిన వాటిని ఇంటికే డెలివరీ చేస్తారు. వీటి కయ్యే ఖర్చు వినియోగదారుడే భరించాల్సి ఉంటుంది. మహబూబ్‌నగర్‌లో ఒకే ఒక రైతుబజార్ ఉంటే లాక్‌డౌన్ నేపథ్యంలో వాటిని ఆరు రైతుబజార్‌లుగా మార్చారు. కంటోన్మెంట్ ఏరియాలో జనం రాకపోకలు నిలిపి వేసి సంచార రైతు బజారు ఏర్పాటు చేశారు. వాటితోపాలు, పండ్లు వాహనాలు ఏర్పాటు చేసి అందిస్తున్నారు. మార్కెట్ రేట్‌కు కావలసిన నిల్వలను అందుబాటులో ఉంచుతున్నారు.
Tags: m3 fresh, tele booking platform, palamuru district, covid 19 affect, lockdown