బీపీసీఎల్ కొనుగోలుకు వేదాంత గ్రూప్ ఆసక్తి
దిశ, వెబ్‌డెస్క్: ప్రభుత్వ రంగంలోని భారత్ పెట్రోలియం కంపెనీ కార్పొరేషన్ లిమిటెట్ (బీపీసీఎల్)లో ప్రభుత్వ వాటాను కొనుగోలు చేసేందుకు వేదాంత గ్రూప్ ఆసక్తి వ్యక్తికరణకు దాఖలు చేసింది. ఇదివరకే ఉన్న వేదాంత చమురు, గ్యాస్ వ్యాపారాలను విస్తరించేందుకు బీపీసీఎల్‌లో వాటా మరింత తోడ్పడుతుందని వేదాంత గ్రూప్ ప్రతినిధి ఒకరు చెప్పారు. బీపీసీఎల్‌లో ప్రభుత్వానికి 52.98 శాతం వాటా ఉంది. గత కొంతకాలంగా తీవ్రంగా నిధుల కొరతను ఎదుర్కొంటున్న ప్రభుత్వం, ఇటీవల వివిధ ప్రభుత్వ రంగ సంస్థల్లో ఉన్న […]
దిశ, వెబ్‌డెస్క్: ప్రభుత్వ రంగంలోని భారత్ పెట్రోలియం కంపెనీ కార్పొరేషన్ లిమిటెట్ (బీపీసీఎల్)లో ప్రభుత్వ వాటాను కొనుగోలు చేసేందుకు వేదాంత గ్రూప్ ఆసక్తి వ్యక్తికరణకు దాఖలు చేసింది. ఇదివరకే ఉన్న వేదాంత చమురు, గ్యాస్ వ్యాపారాలను విస్తరించేందుకు బీపీసీఎల్‌లో వాటా మరింత తోడ్పడుతుందని వేదాంత గ్రూప్ ప్రతినిధి ఒకరు చెప్పారు. బీపీసీఎల్‌లో ప్రభుత్వానికి 52.98 శాతం వాటా ఉంది.
గత కొంతకాలంగా తీవ్రంగా నిధుల కొరతను ఎదుర్కొంటున్న ప్రభుత్వం, ఇటీవల వివిధ ప్రభుత్వ రంగ సంస్థల్లో ఉన్న ప్రభుత్వ వాటాలను విక్రయించాలని, తద్వారా నిధులను సమీకరించాలని భావిస్తున్న సంగతి తెలిసిందే. ఇందులో భాగంగానే బీపీసీఎల్‌లొ వాటా అమ్మకానికి సిద్ధమైంది. ఈ వాటా ఉపసంహరణతో దేశీ ఇంధన రంగంలో పోటీ నెలకొంటుందని ప్రభుత్వం భావిస్తోంది. ఇప్పటివరకు దేశీయ ఇంధన రంగంలో ఇండియన్ ఆయిల్, హెచ్‌పీసీఎల్, బీపీసీఎల్ కంపెనీలు అగ్రస్థానంలో కొనసాగుతున్నాయి.
ఈ నెల 16తో బీపీసీఎల్ బిడ్డింగ్‌కి ఆసక్తి వ్యక్తీకరణ ప్రక్రియ ముగిసిన సంగతి తెలిసిందే. ప్రభుత్వం రంగ సంస్థల్లో వాటాలను విక్రయించడం ద్వారా కేంద్రం ఈ ఆర్థిక సంవత్సరం ముగిసే నాటికి రూ. 1.2 లక్షల కోట్లను లక్ష్యంగా పెట్టుకుంది. దీంతో పాటు ప్రభుత్వ రంగ బ్యాంకులు, ఆర్థిక సంస్థల్లో వాటాలను విక్రయించి అదనంగా మరో రూ. 90 వేల కోట్లకు సమీకరించాలని భావిస్తోంది. ఇప్పటికే ఎన్‌టీపీసీ, భారత్ ఎర్త్ మూవర్స్, స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా, ఎయిర్ ఇండియా, సిమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా సంస్థల్లో వాటాల విక్రయానికి నీతి అయోగ్ కేంద్రానికి సిఫార్సు చేసింది.