వేడి చేస్తే పాలు ఎందుకు పొంగుతాయి?

దిశ, వెబ్ డెస్క్: కొద్దిగా మంట ఎక్కువైనా లేదా ఆదమరిచినా..Why does milk spill over while boiling ?

Update: 2022-05-01 03:05 GMT

దిశ, వెబ్ డెస్క్: కొద్దిగా మంట ఎక్కువైనా లేదా ఆదమరిచినా స్టవ్ పైన ఉన్న పాలు పొంగుపోతుంటాయి. దీంతో చిరాకొచ్చి ఒక్కోసారి అనిపిస్తుంటది అసలు ఈ పాలెందుకు వేడి చేస్తే పొంగుతాయి అనే డౌట్ వస్తది. అయితే, దానికి అసలైన రీజనేమిటంటే.. వాస్తవానికి మిగతా పదార్థాల కంటే పాలు చాలా తేలికగా ఉంటాయి. పాలు అనేవి మిశ్రమ పదార్థం. కొవ్వులు, లాక్టోజ్, ప్రొటీన్లు, నీరు ఇలా అనేక పదార్థాలు సమ్మిళితమై ఉంటాయి. పాలను కొద్దిగా వేడి చేసినప్పుడు ప్రొటీన్లు, కొవ్వులు విడిపోతాయి. అందుకే పాలు పొంగుతుంటాయి. అయితే, పాలు పొంగకుండా వాటిని వేడిచేసినప్పుడు అందులో పొడవాటి చెంచాను ఉంచితే పాలు పొంగవు. 


Similar News