సాయంత్రం వేళ.. కారంకారం పన్నీర్ చిప్స్ చేసుకోండి ఇలా
దిశ, వెబ్‌డెస్క్ : ఈవినింగ్ అయ్యిందంటే చాలు వేడి వేడి.. కర కరలాడే చిప్స్ తినాలని ఎవరికీ ఉండదు.
దిశ, వెబ్‌డెస్క్ : ఈవినింగ్ అయ్యిందంటే చాలు వేడి వేడి.. కర కరలాడే చిప్స్ తినాలని ఎవరికీ ఉండదు. చాలా మంది ఈవినింగ్ చిప్స్ అంటేనే ఇష్టపడుతుంటారు. అందుకోసమే ఈ సాయంత్రం మనం స్నాక్స్ ఎలా తయారు చేయాలో నేర్చుకుందాం. కారం కారంగా ఉండే పన్నీర్ రోల్స్ తయారీ విధానం ఇప్పుడు చూద్దాం.
1. తురిమిన పన్నీర్1.5 కప్పు
2.సన్నగా తరిగిన పచ్చిమిర్చి
4.వైట్ బ్రెడ్-8 స్లైసులు
5.బ్రెడ్ క్రంబ్స్-1/2 కప్పు
6.సన్నగా తరిగిన కొత్తిమీర-2 టేబుల్ స్పూన్లు
7.తురిమిన చీజ్-3 టేబుల్ స్పూన్లు
8.కారం-1 టీ స్పూను
9.నూనె-వేయించడానికి సరిపడా
10.ఛాట్ మసాలా-1/2 టీ స్పూను
11. ఉప్పు-రుచికి తగినంత
తయారీ విధానం : ముందుగా ఒక పెద్ద బౌల్ తీసుకోవాలి. అనంతరం పచ్చిమిర్చి , కొత్తిమీర, చీజ్ కారం, ఛాట్ మసాలా, రుచికి తగినంత ఉప్పు వేసి పేస్టులా చేసుకోవాలి. తర్వాత బ్రెడ్ స్లైసులని తీసుకుని చివర్లు కత్తిరించాలి. చపాతీ కర్ర తీసుకుని బ్రెడ్ స్లైసులని చపాతీలాగ వత్తుకోవాలి. అనంతరం మనం ముందుగా తయారు చేసుకున్న పేస్టును ఒక్కో స్లైసులో పెట్టి మరలా వాటిని వత్తుకోవాలి. ఇలా వత్తుకున్న తర్వాత.. స్టవ్ మీద నూనె వేడి చేసి ఆ బ్రెడ్ స్లైసులను వేయించాలి. బాగా వేగాకా ఒక కిచెన్ నాప్కిన్ మీదకి తీసుకుంటే ఇది నూనెని పీల్చుకుంటుంది. దీంతో వేడి వేడి కారం కారం పన్నీర్ రోల్స్ రెడీ. ఇక వీటిలోకి టమాట చెట్నీ వేసుకోని సాయంత్రం తింటే ఆ రుచే వేరు.