మీ చిన్నారికి ఆరు నెలలు వచ్చాయా.. ఇంట్లోనే ఇలా సెర్లాక్ రెడీ చేసి పెట్టండి!
దిశ, ఫీచర్స్ : ప్రతి తల్లి కోరుకునేది తమ పిల్లల ఆరోగ్యమే. వారికి ఎలాంటి అనారోగ్య సమస్యలు రాకుండా, సమయానికి మంచి ఫుడ్ ఇస్తూ అమ్మ కంటికి రెప్పలా వారిని కాపాడుకుంటూ వస్తుంది. మరీ ముఖ్యంగా పసిపిల్లలు, సంవత్సరం లోపు పిల్లల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలంటారు వైద్యులు. వారి ఏ నెలలో ఎలాంటి ఫుడ్ పెట్టాలో సరిగ్గా తెలుసుకుని వాటిని ఫాలో కావాలి.
అయితే పాప లేదా బాబుకు ఆరు నెలలు రాగానే తల్లిదండ్రులు తమ పిల్లలకు ఫుడ్ పెట్టే విషయంలో చాలా భయపడుతుంటారు. అసలు ఏది పెడితే ఆరోగ్యానికి మంచిదని తెగ ఆలోచిస్తుంటారు. ఇక మార్కెట్‌లో పిల్లలకు పెట్టేసెర్లాక్ డబ్బలు ఎన్నోరకాలున్నా, వాటిపై అంతగా ఇంట్రెస్ట్ చూపరు. అయితే అలాంటి వారి కోసమే ఈ సమాచారం. మీ చిన్నారికి ఇలా ఇంట్లోనే సెర్లాక్ తయారు చేసుకోవచ్చు. అది ఎలా అంటే?
సెర్లాక్ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు
రాగులు ఒక కప్పు
శనిగపప్పు ఒక కప్పు
గోధుమలు
బాదం
జీడిపప్పు
బ్రౌన్ రైస్ ఒక కప్పు
నెయ్యి
తయారీ విధానం : ముందుగా స్టవ్ ఆన్ చేసి, పెనం పెట్టాలి. దానిపై రెండు చుక్కల నెయ్యి వేయాలి. ఆ తర్వాత రాగులు, శనిగపప్పు, గోధుమలు బాదంపప్పు, జీడిప్పు బ్రౌన్ రైస్ వీటన్నింటిని దోర దోరగా వేయించుకోవాలి. ఆ తర్వాత వాటిని మిక్సీ పట్టుకోవాలి. అంతే చిన్నపిల్లలకు బలమైన ఆహారం సెర్లాక్ రెడీ.
Read More..
కజ్జికాయలను ఈ విధంగా చేసుకోండి.. చాలా టేస్టీగా ఉంటాయి!
35 ఏళ్లు దాటిన తర్వాత ప్రెగ్నెంట్ అయ్యారా ? ఎలాంటి డైట్ తీసుకోవాలంటే..