ఆంధ్రా స్పెషల్ ఆవకాయ పచ్చడి.. దాని రుచే వేరు
దిశ, వెబ్‌డెస్క్ : ఆవకాయ పేరు వింటేనే నోరు ఊరుతుంది కదూ.. వేసవి వచ్చిందంటే మన అమ్మమ్మలు,
దిశ, వెబ్‌డెస్క్ : ఆవకాయ పేరు వింటేనే నోరు ఊరుతుంది కదూ.. వేసవి వచ్చిందంటే మన అమ్మమ్మలు, అమ్మలు మొట్టమొదట చేసేపని ఆవకాయ పెట్టడం. ఆవకాయ అనేది గోదావరి వంటకాలకు పెట్టింది పేరు. ఇది తాజాగా కొనుగోలు చేసిన మామిడికాయలతో తయారు చేయబడింది. ఈ మామిడి పికిల్ భారతదేశంలోని బేడేకర్ ఊరగాయ, కడుమంగ ఆచార్, కన్నిమంగ ఆచార్, గోర్కేరి ఊరగాయ వంటి అనేక ప్రత్యేక పేర్లతో దిన్ని పిలుస్తారు. ఆవకాయ రుచులను రుచి చూడకుండా ఆంధ్రాలో ఏ ఇల్లు వేసవిని దాటదు. అంతే కాదు ఇది చాలా కాలం పాటు నిల్వ ఉండే అద్భుతమైన సాధారణ విందు. ఆలస్యం చేయ్యకుండా కావాల్సిన పదార్థాలు, తయారి విధానం చూసేద్దాం.
కావలసిన పదార్ధాలు
* మామిడికాయలు -12
* మెంతులు -50 గ్రాములు
* ఆవాలు -400 గ్రాములు(పొడి చేసుకోవాలి)
* వెల్లుల్లి పాయలు -4
* తాజా పొద్దుతిరుగుడు నూనె- మామిడి ముక్కలు పూర్తిగా మునిగే అంతా.
* ఉ ప్పు -200 గ్రాములు
* రెడ్ చిల్లీ పౌడర్ -400 గ్రాములు
తయారి విధానం
తాజాగా కొనుగోలు చేసిన మామిడికాయలను ముందుగా శుభ్రంగా కడిగి, తడి లేకుండా తుడిచి ముక్కలగా కోసుకోవాలి. ముక్కలు ఆరిన తర్వాత, ఒక పెద్ద బెసెన్ తీసుకుని అందులో మామిడి ముక్కలు, ఉప్పు మినహా మిగిలన పదార్ధాలు పైన చెప్పిన కొలతల ప్రకారం ఒక్కొక్కటిగా వేసుకుని కలుపుకోవాలి. ఉప్పు ఒకే సారి మొత్తం వేయకుండా కొద్ది కొద్దిగా వేసుకుంటు కలుపుకోవాలి. అలా కలిపిన మిశ్రమాన్ని, గాలి లోపలకు పోకుండా ఒక జాడిలో పెట్టి గట్టిగా కట్టేయాలి. 3వ రోజు మరల కలపాలి. అంతే రుచికరమైన, ఆరోగ్యమైన ఆవకాయ రెడీ. ఇంకెందుకు ఆలస్యం మీరు ప్రయత్నించండి.