ఎండాకాలంలో గుడ్లు త్వరగా పాడవకుండా ఉండాలంటే ఏం చేయాలి?

దిశ, వెబ్ డెస్క్: చాలామందికి ఓ డౌట్ ఉంటుంది. ఎండాకాలంలో గుడ్లు త్వరగా పాడవుతున్నాయి.. ఇలా పాడవకుండా ఉండాలంటే ఏం చేయాలి అని అనుకుంటారు. human interest how do you keep eggs fresh for longer egg storage tips in Telugu

Update: 2022-05-17 02:59 GMT

దిశ, వెబ్ డెస్క్: చాలామందికి ఓ డౌట్ ఉంటుంది. ఎండాకాలంలో గుడ్లు త్వరగా పాడవుతున్నాయి.. ఇలా పాడవకుండా ఉండాలంటే ఏం చేయాలి అని అనుకుంటారు. అయితే, కొంతమంది గుడ్లు పాడవకుండా వాటిని ఫ్రిజ్లో పెడుతుంటారు. అలా పెట్టడం వల్ల అవి త్వరగా పాడవుతాయి. అలా అస్సలే చేయకూడదు. ఎందుకంటే గుడ్డు లోపల ఉండే సాల్మొనెల్లా అనే బ్యాక్టీరియా పెరుగుదల చల్లని ప్రదేశంలో ఎక్కువగా ఉంటుంది. గుడ్డును ఫ్రిజ్లో పెట్టినప్పుడు ఈ బ్యాక్టీరియా పెరగడమే కాకుండా ఫ్రిజ్లో నిల్వ ఉంచిన ఇతర వస్తువులు, కూరగాయలపై కూడా వ్యాపిస్తుంది. మరో విషయమేమిటంటే.. గుడ్డును ఫ్రిజ్లో పెట్టడం కారణంగా అధిక చలి వల్ల గుడ్డు పెంకు పగిలిపోయే అవకాశముంది. అందుకే గుడ్లను ఫ్రిజ్లో పెట్టకూడదు. గుడ్లు ఎక్కువ రోజులు పాడవకుండా ఉండాలంటే గుడ్లను విడిగా తీసుకుని టిష్యూ పేపర్ లో చుట్టాలి. అదేవిధంగా వంటకు ఉపయోగించి రిఫైన్డ్ ఆయిల్ కొన్ని చుక్కలు తీసుకుని గుడ్డుపై రుద్దాలి. ఇలా చేస్తే గుడ్డు సుమారుగా 12 రోజుల వరకు పాడవకుండా ఉండే అవకాశముంది. 


Similar News