ఈవినింగ్ సరదాగా స్నాక్స్ తినాలని ఉందా.. ఇది ట్రై చేయండి
సాయంత్రం అయ్యిందంటే చాలు చాలా మందికి ఏదో ఒకటి తినాలనిపిస్తుంది. కొందరు బయటకు వెళ్లి స్నాక్స్ కొనుగోలు చేసుకొని తింటే మరికొందరు ఇంట్లోనే స్నాక్స్ తయారు చేసుకొని తింటుంటారు.
దిశ, వెబ్‌డెస్క్ : సాయంత్రం అయ్యిందంటే చాలు చాలా మందికి ఏదో ఒకటి తినాలనిపిస్తుంది. కొందరు బయటకు వెళ్లి స్నాక్స్ కొనుగోలు చేసుకొని తింటే మరికొందరు ఇంట్లోనే స్నాక్స్ తయారు చేసుకొని తింటుంటారు. అయితే ఈ సాయంత్రానికి త్వరగా చేయగలిగే ఆంధ్ర స్టైల్ మసాల వడలు ఎలా తయారు చేయాలో చూద్దాం.
కావాల్సిన పదార్థాలు
శెనగపప్పు ఒక కప్పు
కొత్తిమీర
పుదీనా తరుగు
వెల్లుల్లి రెబ్బలు నాలుగు లేదా ఐదు
పచ్చిమిర్చి ఆరు లేదా ఎనిమిది
లవంగాలు నాలుగు
ఉప్పు రుచికిసరిపడ
నూనె వేయించడానికి సరిపడ
ఉల్లిపాయ ముక్కలు చిన్నగా తరిగినవి
తయారీ విధానం : ముందుగా శెనగపప్పును నాలుగు గంటల సేపు నానబెట్టుకోవాలి. తర్వాత ఉల్లిపాయలు, కొత్తిమీర, పుదీనా తరిగి పక్కన పట్టుకోవాలి. అనంతరం మిక్సీలో పచ్చిమిర్చి, ఉప్పు, లవంగాలు, అల్లం, వెల్లుల్లి వేసి మెత్తని పేస్ట్ లా తయారు చేసుకోవాలి. ఈ పేస్ట్ ను ఒక బౌల్ లోనికి తీసుకొన్న తర్వాత, మనం ముందుగా నానబెట్టిన శెనగప్పును కూడా మెత్తని పేస్టులా గ్రైండ్ చేసుకోవాలి.
దీని తర్వాత మనం ముందుగా మిక్సిలో పట్టిన వెల్లుల్లి పేస్టును, శనగపప్పు పేస్ట్‌లో వేసి మెత్తగా కలపాలి. అనంతరం మనం ముందుగా తరిగి పెట్టుకొన్న కొత్తిమీర, పుదీనా, ఉల్లిపాయ ముక్కలు వేసి బాగా కలుపుకోవాలి.
ఇప్పుడు స్టౌ వెలిగించి పాన్ పెట్టి నూనె పోసి వేడయ్యాక, మసాలా పిండిని చిన్న ఉండలుగా చేసుకొని అరచేతిలో పెట్టి వడలుగా కావాల్సిన సైజుల్ వత్తుకొని కాగే నూనెలో వేసి ఎర్రగా వేయించి ప్లేట్ లోకి తీసుకొని వేడి వేడిగా సర్వ్ చేయాలి. వీటికి పుదీనా చట్నీ కూడా మంచి కాంబినేషన్. ఇక సాయంత్రం వేళ తినడానికి ఇవి ఎంతో బాగుంటాయి. మరి ఇంకెందుకు లేట్ సాయంత్రం మీ కుటుంబానికి మంచి స్నాక్స్ చేసిపెట్టండి.
ఇవి కూడా చదవండి: