ఈ పద్ధతిలో చికెన్ వండితే చాలు.. కంచం ఖాళీనే..
చాలా మంది మాంసం ప్రియులకు ముక్కలేనిదే భోజనం చేయాలనిపించదు.
దిశ, వెబ్‌డెస్క్ : చాలా మంది మాంసం ప్రియులకు ముక్కలేనిదే భోజనం చేయాలనిపించదు. మాంసాహారుల్లో కూడా చాలా మంది చికెన్‌ను ఎక్కువగా ఇష్టపడతారు. వారిలో కొంత మంది అయితే చికెన్ లేనిదే జీవితం లేదు అన్నంతగా ఇష్టపడతారు. అందుకే మాంసాహారాల్లో ఎక్కువగా అమ్ముడు పోయేది చికెన్. అయితే ఆ చికెన్‌ను కొన్ని చిట్కాలు ఫాలో అయ్యి వండినప్పుడే ఆ కూరకు మంచి రుచి వస్తుంది. మరి ఆ చిట్కాలు ఏంటో చూసేద్దామా మరి..
చికెన్‌ను ఎప్పుడు కొన్నా తాజాగా అప్పుడే కట్ చేసిన కోడి మాంసాన్ని మాత్రమే తీసుకోవాలి. అలాంటి చికెన్ వండితేనే కూర రుచికరంగా ఉంటుంది. నిల్వచేసిన చికెన్‌ను వండితే రుచికరంగా ఉండకపోగా అది రబ్బరుగా మారుతుంది. అలాగే కోడి తొడలలో కొవ్వు పదార్థం అధికంగా ఉంటుంది. ఈ కొవ్వు వంట సమయంలో కరిగి చికెన్‌ను తేమగా, మరింత రుచిగా చేయడానికి దోహదపడుతుంది. అందుకే చికెన్ తీసుకునేప్పుడు బోన్-లెస్ చికెన్ ముక్కలను కాకుండా బోన్-ఇన్ చికెన్ కొనండి.
ఇకపోతే చికెన్ స్కిన్ మాంసం తేమను నిలుపుకుంటుంది. అందుకే స్కిన్ కూడా తొలగించకుండా తీసుకోవాలి. అలాగే చికెన్‌ను వండేటప్పుడు చాలా మంది రెండు మూడు సార్లు కడుగుతారు. అలా కడగడం ద్వారా రుచి తగ్గుతుంది. అలా కాకుండా ఒక్కసారి కడిగితే సరిపోతుంది. చికెన్ వండేప్పుడు కొన్ని మసాలాలు, నిమ్మరసం, పెరుగు ఇతర పదార్థాలతో మ్యారినేట్ చేయడం ద్వారా రుచిపెరుగుతుంది. చాలా మంది చికెన్ ఉడికే సమయంలో మూతపెట్టకుండా వండతారు. దాంతో మీ వంట రుచి తగ్గిపోతుంది. అలాకాకుండా వంటచేసేటప్పుడు పాన్ మూతను పెట్టాలి. దీని ద్వారా విడుదలయ్యే ఆవిరి మాంసానికి తేమను ఇచ్చి రుచిగా ఉంటుంది.