ప్రముఖ నటి వాణిశ్రీ ఇంట్లో విషాదం
సీనియర్ నటి వాణిశ్రీ ఇంట్లో విషాదం నెలకొంది. తన కొడుకు అభినయ్ వెంకటేశ్ శుక్రవారం గుండెపోటుతో కన్నుమూశారు. డాక్టర్ అభినయ్ ప్యాలెస్ పనుల నిమిత్తం ఊటీ నుంచి చెంగల్ పట్టు వెళ్లగా.. అక్కడే గుండెపోటుతో తుది శ్వాస విడిచారు. రాత్రి కొడుకుతో ఆడుకుని నిద్రించిన అభినయ్.. నిద్రలోనే ప్రాణాలు విడిచినట్లు తెలుస్తోంది. దీంతో మృతదేహాన్ని చెన్నైలోని వాణిశ్రీ ఇంటికి తీసుకురాగా విషయం బయటకు తెలిసింది. అయితే పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది. అభినయ్ మృతి పట్ల సంతాపం […]
సీనియర్ నటి వాణిశ్రీ ఇంట్లో విషాదం నెలకొంది. తన కొడుకు అభినయ్ వెంకటేశ్ శుక్రవారం గుండెపోటుతో కన్నుమూశారు. డాక్టర్ అభినయ్ ప్యాలెస్ పనుల నిమిత్తం ఊటీ నుంచి చెంగల్ పట్టు వెళ్లగా.. అక్కడే గుండెపోటుతో తుది శ్వాస విడిచారు. రాత్రి కొడుకుతో ఆడుకుని నిద్రించిన అభినయ్.. నిద్రలోనే ప్రాణాలు విడిచినట్లు తెలుస్తోంది. దీంతో మృతదేహాన్ని చెన్నైలోని వాణిశ్రీ ఇంటికి తీసుకురాగా విషయం బయటకు తెలిసింది. అయితే పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.
అభినయ్ మృతి పట్ల సంతాపం వ్యక్తం చేసిన చిత్ర పరిశ్రమ.. వారి కుటుంబానికి దేవుడు అండగా ఉండాలని కోరుకుంది. వాణిశ్రీకి కొడుకు, కూతురు కాగా.. తనయున్ని కోల్పోయిన వాణిశ్రీ కన్నీరుమున్నీరు అవుతోంది. అభినయ్ భార్య కూడా డాక్టర్ కాగా, తను మహానటి సావిత్రి మనవరాలి హాస్పిటల్‌లో పని చేస్తుందట.