బిగ్ బ్రేకింగ్ : తెలంగాణలో సెకండ్ డోస్ నిలిపివేత
దిశ, వెబ్‌డెస్క్ : తెలంగాణలో కరోనా కేసులు విజృంభిస్తున్న విషయం అందరికీ తెలిసిందే. ప్రస్తుతం రాష్ట్రంలో వ్యాక్సినేషన్ ప్రక్రియ కొనసాగుతున్నా కేవలం సెకండ్ డోస్ మాత్రమే ఇస్తున్నారు. దీనంతటికీ వ్యాక్సిన్ కొరతే కారణం. అయితే, రేపటినుంచి (సోమవారం) 45ఏళ్ల పైబడిన వారికి రెండోవ డోస్ వ్యాక్సిన్ పంపిణీ ప్రక్రియను కూడా అకస్మాత్తుగా నిలిపివేస్తున్నట్లు ఆదివారం సాయంత్రం వైద్యారోగ్యశాఖ ప్రకటించింది. కేంద్రం నుంచి రావాల్సిన వ్యాక్సిన్ స్టాక్ రాకపోవడం వల్లే (కోవాగ్జిన్) రెండో డోస్ నిలిపివేస్తున్నట్లు స్పష్టం చేసింది. […]
దిశ, వెబ్‌డెస్క్ : తెలంగాణలో కరోనా కేసులు విజృంభిస్తున్న విషయం అందరికీ తెలిసిందే. ప్రస్తుతం రాష్ట్రంలో వ్యాక్సినేషన్ ప్రక్రియ కొనసాగుతున్నా కేవలం సెకండ్ డోస్ మాత్రమే ఇస్తున్నారు. దీనంతటికీ వ్యాక్సిన్ కొరతే కారణం. అయితే, రేపటినుంచి (సోమవారం) 45ఏళ్ల పైబడిన వారికి రెండోవ డోస్ వ్యాక్సిన్ పంపిణీ ప్రక్రియను కూడా అకస్మాత్తుగా నిలిపివేస్తున్నట్లు ఆదివారం సాయంత్రం వైద్యారోగ్యశాఖ ప్రకటించింది. కేంద్రం నుంచి రావాల్సిన వ్యాక్సిన్ స్టాక్ రాకపోవడం వల్లే (కోవాగ్జిన్) రెండో డోస్ నిలిపివేస్తున్నట్లు స్పష్టం చేసింది. తదుపరి వ్యాక్సినేషన్ తేదీలను త్వరలోనే ప్రకటిస్తామని తెలంగాణ వైద్యారోగ్యశాఖ ప్రకటించింది.