Heatwave : ఆ మూడు జిల్లాలకు రెడ్ అలర్ట్

నిన్నా మొన్నటి వరకు చెదురుమొదురు వర్షాలతో ఊపిరి తీసుకున్న ప్రజలకు ఇకపై వేసవి తీవ్ర ప్రతాపం(Heatwave) చూపించనుంది.

Update: 2025-04-23 10:13 GMT
Heatwave : ఆ మూడు జిల్లాలకు రెడ్ అలర్ట్
  • whatsapp icon

దిశ, వెబ్ డెస్క్ : నిన్నా మొన్నటి వరకు చెదురుమొదురు వర్షాలతో ఊపిరి తీసుకున్న ప్రజలకు ఇకపై వేసవి తీవ్ర ప్రతాపం(Heatwave) చూపించనుంది. రానున్న 3 రోజులపాటు తీవ్రమైన వడగాల్పులు, ఉక్కపోత ఉంటుందని హైదరాబాద్ వాతావరణశాఖ(Hyderabad Meteorological Department) అధికారులు స్పష్టం చేశారు. ముఖ్యంగా ఉత్తర తెలంగాణ(North Telangana) జిల్లాల్లో వడగాల్పుల ప్రభావం ఎక్కువ ఉండనుందని పేర్కొన్నారు. ఉమ్మడి ఆదిలాబాద్, కరీంనగర్, నిజామాబాద్ జిల్లాల్లో తీవ్రమైన ఉక్కపోత, ఎండలు, వడగాల్పులు ఉండనున్న నేపథ్యంలో ఆయా జిల్లాలకు అధికారులు రెడ్ అలర్ట్(Red Alert) జారీ చేశారు. పగటి సమయంలో ప్రజలు బయట తిరగవద్దని సూచించారు.

ఇక సంగారెడ్డి, వికారాబాద్, హైదరాబాద్, యాదాద్రి భువనగిరి, రంగారెడ్డి జిల్లాలకు తప్ప మిగిలిన అన్ని జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్స్ జారీ చేశారు. రాత్రిపూట కూడా వాతావరణం వేడిగా ఉండే అవకాశం ఉందని తెలియజేశారు. రాష్ట్రంలో అనేక చోట్ల పగటి ఉష్ణోగ్రతలు 44 డిగ్రీలకు పైగా నమోదయ్యే అవకాశం ఉందని అన్నారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు. అయితే ఎల్లుండి మాత్రం రాష్ట్రంలోని కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు.

Tags:    

Similar News

Expand player