నాట్ ఇంట్రెస్ట్.. టీకాపై సామాన్యుడి వెనకడుగు
దిశ ప్రతినిధి, నిజామాబాద్ : ఒకటో తేదీ నుంచి 60 సంవత్సరాలు దాటిన వారు, 45 సంవత్సరాలు దాటి ఎంపిక చేయబడిన వ్యాధులతో బాధపడుతున్న వారికి వ్యాక్సిన్ వేయాలని ప్రభుత్వాలు నిర్ణయించాయి. అందులో భాగంగా సోమవారం ఉమ్మడి జిల్లాలో ఏర్పాటు చేసిన కేంద్రాల్లో టీకాలు వేసే కార్యక్రమం ప్రారంభంమైంది. అయితే ప్రతి సెంటర్‌లో 200 మందికి టీకాలు వేసేందుకు అధికారులు ఏర్పాట్లు చేసినా ప్రజలెవరూ ముందుకు రాకపోవడం విశేషం. నిజామాబాద్ జిల్లా కేంద్రంలో మూడు, కామారెడ్డిలో రెండు […]
దిశ ప్రతినిధి, నిజామాబాద్ : ఒకటో తేదీ నుంచి 60 సంవత్సరాలు దాటిన వారు, 45 సంవత్సరాలు దాటి ఎంపిక చేయబడిన వ్యాధులతో బాధపడుతున్న వారికి వ్యాక్సిన్ వేయాలని ప్రభుత్వాలు నిర్ణయించాయి. అందులో భాగంగా సోమవారం ఉమ్మడి జిల్లాలో ఏర్పాటు చేసిన కేంద్రాల్లో టీకాలు వేసే కార్యక్రమం ప్రారంభంమైంది. అయితే ప్రతి సెంటర్‌లో 200 మందికి టీకాలు వేసేందుకు అధికారులు ఏర్పాట్లు చేసినా ప్రజలెవరూ ముందుకు రాకపోవడం విశేషం.
నిజామాబాద్ జిల్లా కేంద్రంలో మూడు, కామారెడ్డిలో రెండు ఆస్పత్రుల్లో కోవాగ్జిన్, కోవిషీల్డ్టీకాల పంపిణీ జరిగింది. నిజామాబాద్ జిల్లాలో 99 మంది టీకాలు వేసుకుంటే, కామారెడ్డి జిల్లాలో 112 మంది వేసుకున్నారు. ఒక్కో సెంటర్‌లో 200 మందికి ప్రతీరోజు ఉదయం 10 నుంచి 4 గంటల వరకు వ్యాక్సినేషన్ ఇచ్చేలా అధికారులు ఏర్పాట్లు చేశారు. Colin.gov.in app ద్వారా ఆన్లైన్లో రిజిస్టర్ చేసుకోని ఏ రోజు ఖాళీగా ఉంటే ఆ రోజున బుక్ చేసుకోని వ్యాక్సిన్ కేంద్రంలో టీకాలు వేయించుకునే సౌకర్యం కల్పించారు. పోర్టల్ ఖాళీగా ఉంటే మూడు గంటల వరకు బుక్ చేసుకునే అవకాశం ఉంటుంది. నిజామాబాద్ జీజీహెచ్, కామారెడ్డి జిల్లా ఆస్పత్రిలో మాత్రం డైరెక్టుగా కూడా రావచ్చు, రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చునని, ప్రైవేట్ లో ఆ సదుపాయం లేదన్నారు. ప్రస్తుతం రెండు రకాల వ్యాక్సిన్ వేస్తున్నారని, తొలిరోజు ఏ వ్యాక్సిన్ ఇస్తారో, రెండో సారి కూడా అదే వ్యాక్సిన్ ఇస్తారు.
నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ జనరల్ ఆస్పత్రిలో 65, ప్రగతి హాస్పటల్లో 23, మెడికవర్ హాస్పిటల్ లో 11 మంది టీకాలు తీసుకున్నారు. సోమవారం 101 మంది టీకాలు తీసుకునేందుకు రిజిస్ర్టేషన్ చేసుకోగా 99 మంది తీసుకున్నారని డీఎంహెచ్వో సుదర్శనం తెలిపారు. కామారెడ్డి జిల్లా ఆస్పత్రిలో 91, రష్ హాస్పిటల్లో 21 మంది మాత్రమే టీకాలు వేసుకున్నారని ఇన్చార్జి డీఎంహెచ్వో సుధారాణి తెలిపారు. ప్రతి ఆస్పత్రిలో 200 మందికి టీకాలు వేయాలనుకుని, అందుకు అనుగుణంగా అధికారులు ఏర్పాట్లు చేసినా ప్రజలు ముందుకు రాకపోవడం విశేషం.
ప్రంట్ లైన్ వారియర్స్ కు జనవరి 16 నుంచి కరోనా వాక్సిన్ పంపిణీ చేసేందుకు అధికార యంత్రాంగం ఏర్పాట్లు చేసినా స్పందన అంతంత మాత్రమే. మొదటి డోసుకు 24,176 మంది అర్హులు కాగా 11,914 మంది మాత్రమే వేసుకోగా, 49 శాతం నమోదైంది. రెండో డోసుకు 6,530 మందికి గాను 5,284 మంది మాత్రమే వేసుకున్నారు. కరోనా కాలంలో పోరాడిన యోధులుగా ఉన్న వైద్య, పోలిస్, ఆంగన్వాడీ, ఆశ వర్కర్లు, ఆగ్నిమాపక శాఖ సిబ్బంది కరోనా వ్యాక్సిన్ వేసుకునేందుకు ముందుకు రాకపోవడంతో అప్రభావం సాధారణ ప్రజలపై పడుతోంది. ముఖ్యంగా 60 సంవత్సరాల వయస్సు గల వారికి, 45 సంవత్సరాల పైబడి గుర్తించబడిన రుగ్మతులు ఉన్నవారు కొవీ షీల్డ్, కొవాగ్జిన్టీకాలను వేసుకునేందుకు ముందుకు రావడం లేదు. ఈ విషయం వైద్యారోగ్య ఆరోగ్య శాఖ ను కలవరపెడుతోంది.