కరోనా నివారణ కోసం వ్యాక్సిన్ ఒక్కటే మార్గం: సుష్మా రెడ్డి

దిశ, రాజేంద్రనగర్: కరోనా నివారణకు వ్యాక్సిన్ ఒక్కటే మార్గమని శంషాబాద్ మున్సిపల్ చైర్ పర్సన్ సుష్మా రెడ్డి అన్నారు. శుక్రవారం రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మున్సిపాలిటీ 23వ వార్డు మధుర నగర్‎లో కరోనా వ్యాక్సినేషన్‌ను ఆమె ప్రారంభించారు. ఇందులో భాగంగా మధుర నగర్ వార్డు టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు పవన్ కుమార్ గౌడ్ రెండో డోస్ తీసుకున్నారు. ఈ సందర్భంగా సుష్మారెడ్డి మాట్లాడుతూ.. ఆస్పత్రులకు వెళ్లి కరోనా వ్యాక్సిన్ వేసుకోవడానికి తీవ్ర ఇబ్బందులకు గురవుతున్న వారికి కూడా […]

Update: 2021-09-24 06:57 GMT

దిశ, రాజేంద్రనగర్: కరోనా నివారణకు వ్యాక్సిన్ ఒక్కటే మార్గమని శంషాబాద్ మున్సిపల్ చైర్ పర్సన్ సుష్మా రెడ్డి అన్నారు. శుక్రవారం రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మున్సిపాలిటీ 23వ వార్డు మధుర నగర్‎లో కరోనా వ్యాక్సినేషన్‌ను ఆమె ప్రారంభించారు. ఇందులో భాగంగా మధుర నగర్ వార్డు టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు పవన్ కుమార్ గౌడ్ రెండో డోస్ తీసుకున్నారు.

ఈ సందర్భంగా సుష్మారెడ్డి మాట్లాడుతూ.. ఆస్పత్రులకు వెళ్లి కరోనా వ్యాక్సిన్ వేసుకోవడానికి తీవ్ర ఇబ్బందులకు గురవుతున్న వారికి కూడా వ్యాక్సిన్ వేయాలనే ఉద్దేశంతో స్పెషల్ డ్రైవ్ కింద వ్యాక్సినేషన్ సెంటర్లు ఏర్పాటు చేశామన్నారు. ఇంటి నుంచి వ్యాక్సిన్ సెంటర్‌కు రాలేని వృద్ధులకు సైతం వారి వద్దకు వెళ్లి వ్యాక్సిన్ ఇవ్వడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో నార్సింగి మార్కెట్ కమిటీ చైర్మన్ దూడల వెంకటేష్ గౌడ్, కౌన్సిలర్ స్రవంతి శ్రీకాంత్ రెడ్డి, కో ఆప్షన్ సభ్యులు కవితా ప్రసాద్, పీఎసీఎస్ చైర్మన్ మల్లారెడ్డి, టీఆర్ఎస్ పార్టీ వార్డు అధ్యక్షులు పవన్ కుమార్ గౌడ్, ప్రధాన కార్యదర్శి నరసింహ గౌడ్, దేవేందర్ రెడ్డి, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.

Tags:    

Similar News